Thank You Movie: ఇటీవల లవ్‌స్టోరీ సినిమాతో ప్రేక్షకులను పలకరించి… సూపర్ హిట్ అందుకున్నారు యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య. శేఖర్ కమ్ముల దర్శత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. ఇందులో నాగచైతన్య నటనకు అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. కాగా, ప్రస్తుతం “థాంక్యూ” చిత్రంలో నటిస్తున్నారు చైతన్య. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రబృందం. చివరగా కొన్ని ప్యాచ్ వర్క్స్ మిగిలి ఉన్నాయని తెలుస్తోంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో రాశి ఖన్నా, అవికా గోర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ వెలువడకపోవడంతో మూవీని ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఓ ప్రముఖ ఓటిటి సంస్థతో డీల్ పూర్తయ్యిందని కూడా అన్నారు.
Also Read: “ఆర్ఆర్ఆర్” మూవీ నుంచి “అలియా భట్” మేకింగ్ వీడియో ఔట్…
ఈ మేరకు ఈ సినిమా రిలీజ్ పై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. “థాంక్యూ” సినిమా థియేటర్లోనే విడుదల కానుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు మూవీ యూనిట్. మరోవైపు నాగ చైతన్య ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో “బంగార్రాజు” సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని జనవరి 2022 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ‘మనం’లో కలసి నటించిన తండ్రీ కొడుకు మళ్లీ బంగార్రాజు తో మెప్పించేందుకు రానున్నారు. అలానే నాగ చైతన్య, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వెబ్ సిరీస్ కోసం కమిట్ అయ్యాడు. ఈ ప్రాజెక్ట్ పై అతి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమా చైతూకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
#ThankYouTheMovie will release only in theaters. pic.twitter.com/M3i7N9qw7J
— Sri Venkateswara Creations (@SVC_official) December 8, 2021
Also Read: కమల్ హాసన్ “ఇండియన్ 2 ” సినిమాలో ఛాన్స్ కొట్టేసిన తమన్నా…