గ్రేటర్లో కౌంటింగ్ కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసా?

జీహెచ్ఎంసీలోని 150డివిజన్లు ఎన్నికలు ముగిశాయి. డిసెంబర్ 1న 149డివిజన్లలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓల్డ్ మలక్ పేటలో మాత్రం ఎన్నికల గుర్తులు తారుమారుకావడంతో నేడు రీ పోలింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను ఎన్నికల అధికారులు స్ట్రాంగ్ రూములకు తరలించి భద్రపరిచారు. Also Read: బస్తీల్లో అధికశాతం ఓటింగ్ దేనికి సంకేతం? రేపు ఎన్నికల ఫలితాలు రానుండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఎన్నికల అధికారులు ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. నగరంలోని […]

Written By: Neelambaram, Updated On : December 3, 2020 11:13 am
Follow us on

జీహెచ్ఎంసీలోని 150డివిజన్లు ఎన్నికలు ముగిశాయి. డిసెంబర్ 1న 149డివిజన్లలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓల్డ్ మలక్ పేటలో మాత్రం ఎన్నికల గుర్తులు తారుమారుకావడంతో నేడు రీ పోలింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను ఎన్నికల అధికారులు స్ట్రాంగ్ రూములకు తరలించి భద్రపరిచారు.

Also Read: బస్తీల్లో అధికశాతం ఓటింగ్ దేనికి సంకేతం?

రేపు ఎన్నికల ఫలితాలు రానుండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఎన్నికల అధికారులు ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కౌంటర్లో కేంద్రాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే సిబ్బంది.. ఏజెంట్లు వాహనాలను పార్క్ చేసుకునేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

నగరంలోని కౌంటర్ కేంద్రాల జాబితాను ఓసారి పరిశీలిస్తే.. కార్వాన్ డివిజన్లోని ఆరు వార్డులకు ఎల్‌బీ స్టేడియంలోని బాక్సింగ్.. జిమ్నాజియం హాల్లో కౌంటింగ్ నిర్వహిస్తారు. గోషామహాల్ డివిజన్లోని ఆరు వార్డులకు నిజాం కళాశాల ఓపెన్ గ్రౌండ్లో.. ముషీరాబాద్ డివిజన్లోని ఆరు వార్డులకు దోమలగూడ ఏవీ కళాశాలలోని లా కళాశాలలో కౌంటింగ్ నిర్వహిస్తారు.

సంతోష్ నగర్ డివిజన్లోని ఆరు వార్డులకు బండ్లగూడలోని మహావీర్ ఇనిస్టిటూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో.. చాంద్రాయణగుట్ట డివిజన్లోని ఏడు వార్డులకు బండ్లగూడలోని అరోరా లీగల్ సైన్సెస్ అకాడమీలో.. చార్మినార్ డివిజన్లోని ఐదు వార్డులకు హైకోర్టు రోడ్డులోని ప్రభుత్వ సిటీ కళాశాలలో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశారు.

Also Read: వరదసాయం టీఆర్ఎస్ ను గట్టెక్కించేనా?

మలక్ పేట డివిజన్లోని ఏడు వార్డులకు అంబర్ పేట మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో.. సికింద్రాబాద్ డివిన్లోని ఐదు వార్డులకు ఉస్మానియా యూనివర్శిటీ కామర్స్ కళాశాలలో.. ఫలక్‌నూమా డివిజన్లోని ఆరు వార్డులకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఆవరణలోని కమలానెహ్రూ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహిస్తారు.

మెహిదీపట్నం డివిజన్లోని ఏడు వార్డులకు మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో.. జూబ్లీహిల్స్ డివిజన్లోని నాలుగు వార్డులకు బంజారాహిల్స్ సుల్తాన్ ఉలుమ్ ఎడ్యుకేషన్ క్యాంపస్ లో.. యూసుఫ్‌గూడలోని ఐదు వార్డులకు కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ జరుగనుంది.

బేగంపేట డివిజన్లోని నాలుగు వార్డులకు సికింద్రాబాద్ పిజీ కళాశాల రోడ్డులోని వెస్లీ కాలేజీలో.. ఖైరతాబాద్ డివిజన్లోని ఆరు వార్డులకు సనత్ నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కౌంటింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పలు ఆంక్షలు విధించారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్