https://oktelugu.com/

కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్.. ఆ అవయవానికి చాలా డేంజర్..?

ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రజల్లో కరోనా మహమ్మారి భయం తగ్గినా నిర్లక్ష్యం చేస్తే వైరస్ మళ్లీ విజృంభించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైరస్ గురించి, వ్యాక్సిన్ గురించి పరిశోధనలు కొనసాగుతుండగా శాస్త్రవేత్తల పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. Also Read: కీళ్ల నొప్పులను సులువుగా తగ్గించుకోవడానికి పాటించాల్సిన చిట్కాలివే..? కరోనా వైరస్ సోకి ఆ తరువాత నెగిటివ్ వచ్చినా ఊపిరితిత్తుల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 3, 2020 / 09:25 AM IST
    Follow us on


    ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రజల్లో కరోనా మహమ్మారి భయం తగ్గినా నిర్లక్ష్యం చేస్తే వైరస్ మళ్లీ విజృంభించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైరస్ గురించి, వ్యాక్సిన్ గురించి పరిశోధనలు కొనసాగుతుండగా శాస్త్రవేత్తల పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

    Also Read: కీళ్ల నొప్పులను సులువుగా తగ్గించుకోవడానికి పాటించాల్సిన చిట్కాలివే..?

    కరోనా వైరస్ సోకి ఆ తరువాత నెగిటివ్ వచ్చినా ఊపిరితిత్తుల వైరస్ తీవ్రస్థాయిలో ప్రభావం చూపినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 19 నుంచి 69 సంవత్సరాల మధ్య వయస్సు గల 10 మంది కరోనా రోగులపై పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపిన పది మంది రోగుల్లో 8 మందిలో కొన్ని నెలల పాటు శ్వాస సంబంధిత సమస్యలను గుర్తించారని సమాచారం.

    Also Read: వారికి కరోనా సోకదు.. శాస్త్రవేత్తల సంచలన ప్రకటన..?

    జెనాన్ అనే గ్యాస్ సహాయంలో ఎం.ఆర్.ఐ స్కాన్ చేసి శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలను నిర్వహించారు. కరోనా నుంచి కోలుకున్నా భవిష్యత్తులో ఊపిరితిత్తుల సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యుక్త వయస్సు వారితో పోల్చి చూస్తే వయస్సు పైబడిన వారిలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా రోగులకు చికిత్సా విధానంలో మరిన్ని మార్పులు అవసరమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    మరోవైపు కరోనా వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ లో మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. వచ్చే ఏడాది నాటికి ఐదు నుంచి పది కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే కొంతమందికి వ్యాక్సిన్ ఇచ్చినా కరోనా వైరస్ చైన్ ను బ్రేక్ చేసినట్టు అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.