Site icon OkTelugu

తెలంగాణలో కొత్తగా 609 కరోనా కేసులు

తెలంగాణలో రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే కేసులు కాస్త పెరిగాయి. వైద్య, ఆరోగ్యశాఖ గురువారం వారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 609 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,71,492 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,465గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,61,028 మంది కోలుకోగా ప్రస్తుతం 8,999యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 6,922 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు.

Exit mobile version