మొన్నటివరకు ఆస్ట్రేలియాపై చిత్తుగా ఓడుతుందని ఇదే ఇంగ్లండ్ క్రికెటర్లు ఎద్దేవా చేశారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అయితే టీమిండియా ఆస్ట్రేలియా ముందు నిలవలేదని.. కోహ్లీ లేని టీం 4-0తో ఓడుతుందని ఎద్దేవా చేశాడు.
Also Read: స్మిత్, మ్యాక్స్ వెల్, హర్భజన్ ఔట్.. ఐపీఎల్ లో దిగ్గజాలను వదులుకున్న జట్లు
కానీ నవ్విన నాపచేనే పండింది. ఆస్ట్రేలియన్ల దురహంకారం.. జాత్యాహంకార అభిమానులకు తగిన బుద్ది చెబుతూ ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించింది. వారికే కాదు ప్రపంచవ్యాప్తంగా టీమిండియాను ఎగతాళి చేసిన వారి చెంప చెళ్లుమనేలా గెలిచింది.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఇంగ్లండ్ క్రికెటర్లు కూడా దెబ్బకు దారికొచ్చారు. శ్రీలంకతో టెస్టు సిరీస్ లో గెలుపు బాటలో ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ తాజాగా టీమిండియా ముందు నిలబడాలంటే చాలా కష్టపడాలంటూ బెదిరిపోతున్నాడు.
Also Read: ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ కు భారత జట్టు ఇదే!
భారత్ ఏకంగా ఆస్ట్రేలియాను ఆ దేశంలో ఓడించి సంచలనం సృష్టించిందని రూట్ అన్నాడు.. మాతో సిరీస్ కు టీమిండియా గొప్ప ఆత్మవిశ్వాసంతో ఉంది. సొంతగడ్డపై భారత్ తో మరింత డేంజర్. కోహ్లీ సేనతో పోరాడాలంటే అత్యుత్తమానికి మించిన ప్రతిభను కనబరచాలి? మేమెంతో శ్రమించాలని ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ ఇప్పుడే ఆందోలన చెందుతున్నాడు.