పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో చేసే కరాటే స్టెప్పులను ఫ్యాన్స్ , ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తారు. జానీ మూవీలో అయితే ఫైట్ మాస్టర్ గానే పవన్ నటించి మెప్పించాడు. పవన్ కు కరాటే అంటే అభిమానం అట.. పవన్ కళ్యాణ్ ఎందుకు మార్షల్ నేర్చుకున్నాడనే ప్రశ్నకు చాలా మందికి సమాధానం తెలియదు.
Also Read: వర్షిణితో అభిజీత్.. హైపర్ ఆదికి వార్నింగ్ అందుకే ఇచ్చాడా?
అప్పట్లో పవన్ కళ్యాణ్ కు చదువు పెద్దగా ఎక్కలేదు. కానీ ఎన్నో వందల వేల పుస్తకాలు చదివాడు. అయితే చెన్నైలో ఉన్నప్పుడు కొందరూ చిరంజీవి సినిమాలు చూసి పవన్ ముందే తన అన్నయ్య పై బ్యాడ్ కామెంట్స్ చేయడంతో పాటు లుక్ పై కొన్ని విమర్శలు చేశారట. పవన్ కి కోపం వచ్చినప్పటికీ అప్పుడు బక్కగా ఉండడంతో వారిని ఎదురించ లేకపోయాడట. ఫైటింగ్ చేయాలని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడట.. అందులో బ్లాక్ బెల్ట్ అందుకున్నాడు. అన్నయ్యను కామెంట్ చేసే వాళ్లను కొట్టాలనే కరాటే నేర్చుకున్నాడని ఓ సందర్భంలో పవన్ చెప్పుకొచ్చాడు..
Also Read: రేటింగ్ లో ‘ఆకాశం నీ హద్దు రా’ !
పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చాక కూడా ఆ కళను ప్రదర్శించాడు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. తమ్ముడు, బద్రి, ఖుషీ లాంటి సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్ చూపించాడు. కెరీర్ మొదట్లో చాలా సినిమాల్లో తన మార్షల్ టాలెంట్ చూపించాడు. మార్షల్ ఆర్ట్స్ కారణంగానే సినిమాలో పైట్స్ కూడా అలాగే చేసేవాడు. కొన్ని సినిమాలకు ఫైట్ మాస్టర్ గా కూడా పనిచేశాడు పవన్ కళ్యాణ్. డాడీ సినిమాలో చిరుతో పవన్ కంపోజ్ చేసిన పైట్ ఇప్పటికి ఎంతో అద్భుతంగా ఉంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్