ముగియనున్న టీఎస్పీఎస్ ఛైర్మన్ పదవీకాలం.. భర్తీ ఎప్పుడు చేస్తారు?

తెలంగాణ సర్కార్ త్వరలోనే 50వేల ఉద్యోగాలను భర్తీ చేయనుందని సీఎం కేసీఆర్  ఇటీవలే స్వయంగా ప్రకటించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలను సేకరించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. ఈమేరకు ప్రభుత్వ యంత్రాంగం ఖాళీల వివరాలు.. ఉద్యోగాల నోటిఫికేషన్లపై కసరత్తులను వేగవంతం చేస్తోంది. Also Read: ఫాంహౌస్ లో కేసీఆర్, కేటీఆర్ ఏకాంత చర్చలు.. ఏం జరుగుతోంది? దీంతో కొద్దిరోజులుగా తెలంగాణలో త్వరలో నోటిఫికేషన్లు వస్తాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో నిరుద్యోగులు […]

Written By: Neelambaram, Updated On : December 15, 2020 8:14 pm
Follow us on

తెలంగాణ సర్కార్ త్వరలోనే 50వేల ఉద్యోగాలను భర్తీ చేయనుందని సీఎం కేసీఆర్  ఇటీవలే స్వయంగా ప్రకటించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలను సేకరించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. ఈమేరకు ప్రభుత్వ యంత్రాంగం ఖాళీల వివరాలు.. ఉద్యోగాల నోటిఫికేషన్లపై కసరత్తులను వేగవంతం చేస్తోంది.

Also Read: ఫాంహౌస్ లో కేసీఆర్, కేటీఆర్ ఏకాంత చర్చలు.. ఏం జరుగుతోంది?

దీంతో కొద్దిరోజులుగా తెలంగాణలో త్వరలో నోటిఫికేషన్లు వస్తాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో నిరుద్యోగులు నోటిఫికేషన్లు ఎప్పుడస్తాయా? అని ఎదురుచూస్తున్నారు. అయితే ఈనెల 17తో టీఎస్పీఎస్పీ ఛైర్మన్.. ముగ్గురు సభ్యుల పదవీ కాలం ముగియనుంది. దీంతో ప్రభుత్వం కొత్తవారిని నియమించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.

టీఎస్పీఎస్పీ ఛైర్మన్ సభ్యుల పదవీ కాలం ఆరేళ్లు ఉంటుంది. టీఎస్‌పీఎస్‌ చైర్మన్‌గా ఘంటా చక్రపాణి.. సభ్యులు విఠల్‌.. చంద్రావతి.. మతినుద్దిన్‌ ఖాద్రీలు ఆరేళ్ల పాటు సేవలందించారు. గురువారంతో వీరి పదవీ కాలం ముగియనుంది. దీంతో ప్రభుత్వం కొత్తవారిని నియమించేందుకు కసరత్తులు చేస్తోంది.

Also Read: టీఆర్ఎస్ కు షాక్: బీజేపీలోకి మంత్రి సోదరుడు?

టీఎస్పీఎస్ నిబంధనల ప్రకారం చైర్మన్‌ పదవి చేపట్టినవారు రెండోసారి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం లేదు. అదేవిధంగా సభ్యుడిగా పనిచేసిన వారు సైతం రెండోసారి మెంబర్‌గా పనిచేయడానికి అవకాశం లేదు. దీంతో ఇప్పుడు పదవీ కాలం పూర్తి చేసుకున్న వారికి మరోసారి అవకాశం లేకుండా పోయింది.

ప్రస్తుతం ఉన్న సభ్యుల్లో మరో ఇద్దరు సభ్యుల పదవీ కాలం త్వరలో ముగియనుంది. దీంతో ఒక సభ్యుడిని ఛైర్మన్ పదవీ దక్కే అవకాశం కన్పిస్తోంది. ఇక మిగిలిన స్థానాల్లో కొత్తవారిని నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 21లోపు కొత్త కమిటీ నియామకం పూర్తిచేసే అవకాశముందని సమాచారం. కీలకమైన టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ పదవి కోసం ఆశావహులు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్