https://oktelugu.com/

బిగ్ బాస్ ముగింపుకు అదిరిపోయే ప్లాన్ !

బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ 4 సీజన్ ముంగింపులో జోష్ లేకపోతే ఎలా.. ? అసలు షో ఎండింగ్ లో ఓ రేంజ్ ఎంటర్ టైన్మెంట్ ఉంటేనే.. షో హిట్ అయినట్టు.. లేకపోతే బిగ్ బాస్ కు ఉన్న క్రెడిబులిటీ పోతుంది. అందుకే చివరి రోజు గ్రాండ్ ఫినాలెకి మూడు రోజులు ముందుగానే హౌస్ లోకి కొత్త థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను యాడ్ చేయాలని నిర్వాహకులు ఆలోచిస్తున్నారట. ఇందులో భాగంగా ఈ నెల 17 న […]

Written By:
  • admin
  • , Updated On : December 15, 2020 / 07:30 PM IST
    Follow us on


    బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ 4 సీజన్ ముంగింపులో జోష్ లేకపోతే ఎలా.. ? అసలు షో ఎండింగ్ లో ఓ రేంజ్ ఎంటర్ టైన్మెంట్ ఉంటేనే.. షో హిట్ అయినట్టు.. లేకపోతే బిగ్ బాస్ కు ఉన్న క్రెడిబులిటీ పోతుంది. అందుకే చివరి రోజు గ్రాండ్ ఫినాలెకి మూడు రోజులు ముందుగానే హౌస్ లోకి కొత్త థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను యాడ్ చేయాలని నిర్వాహకులు ఆలోచిస్తున్నారట. ఇందులో భాగంగా ఈ నెల 17 న మళ్లీ బయటకు వచ్చిన టీమ్ మేట్స్ అందరినీ లోపలకు పంపించే ఆలోచనలో ఉన్నారట నిర్వాహకులు. అనగా 17,.18,19 మూడు రోజుల పాటు టోటల్ సభ్యులను హౌస్ లోకి పంపాలని చూస్తున్నారట.

    Also Read: బాలీవుడ్ స్టార్ పై కూతురు సంచలన వ్యాఖ్యలు !

    మరి ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది అన్నదే ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే ఇది కరోనా కాలం.. కాబట్టి ఈ కరోనా నెపథ్యంలో బయట నుండి కొత్తవాళ్లను హౌస్ లోకి పంపాలి అంటే.. మళ్లీ పరిక్షలు ఇతరత్రా వ్యవహారాలు అన్నీ వుంటాయి.. ఉండాలి కూడా. ఈ కరోనా టెస్ట్ లో అంతా ఓకే అనుకున్న వాళ్లే.. హౌస్ లోకి వెళ్తారు. ఇక హౌస్ లోకి వెళ్లిన వారి చేత.. గ్రాండ్ ఫినాలె లో డ్యాన్స్ లు, స్కిట్ లు లాంటివి చేయించాలని బిగ్ బాస్ టీమ్ ఫిక్స్ అయిందట. ఇప్పటికే దీనిపై సమాలోచనలు, అలాగే స్క్రిప్ట్ లు కూడా తయారువుతున్నాయట.

    Also Read: నటి ఆత్మహత్య కేసులో నేరస్థుడు అతనే !

    మొత్తానికి బిగ్ బాస్ చివర్లో మంచి కిక్ ఇచ్చేలా ఉన్నాడు. అనుకున్నట్లుగానే గ్రాండ్ ఫినాలె నాడు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ బాగా వర్కౌట్ అయితే.. ఇక టీఆర్పీ రేటింగ్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ అవ్వడం గ్యారెంటీ. ఇప్పటికే రోజురోజుకూ మంచి టీఆర్పీ వస్తోంది. అలాగే లాస్ట్ వారాల్లో కూడా మంచి టీఆర్పీ నమోదుచేయాలి అంటే సభ్యులు అందరూ మరోసారి హౌస్ లో ఎంట్రీ ఇవ్వాల్సిందే.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్