కరోనా వ్యాక్సిన్ విషయంలో అదిరిపోయే శుభవార్త..?

ప్రపంచ దేశాల్లోని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్ విషయంలో ఆశాజనకమైన ఫలితాలు వెలువడుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో శాస్త్రవేత్తలు మరో శుభవార్త చెప్పారు. మోడెర్నా కరోనా వ్యాక్సిన్ 94.5 శాతం సమర్థవంతంగా పని చేస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. శాస్త్రవేత్తల విశ్లేషణలో ఈ విషయం వెల్లడి కాగా ఇప్పటివరకు క్లినికల్ ట్రయల్స్ లో సక్సెస్ అయిన ఇతర వ్యాక్సిన్లతో పొలిస్తే మోడెర్నా వ్యాక్సిన్ మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. శాస్త్రవేత్తలు మోడెర్నా కరోనా వ్యాక్సిన్ సమర్థత […]

Written By: Navya, Updated On : November 16, 2020 8:19 pm
Follow us on


ప్రపంచ దేశాల్లోని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్ విషయంలో ఆశాజనకమైన ఫలితాలు వెలువడుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో శాస్త్రవేత్తలు మరో శుభవార్త చెప్పారు. మోడెర్నా కరోనా వ్యాక్సిన్ 94.5 శాతం సమర్థవంతంగా పని చేస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. శాస్త్రవేత్తల విశ్లేషణలో ఈ విషయం వెల్లడి కాగా ఇప్పటివరకు క్లినికల్ ట్రయల్స్ లో సక్సెస్ అయిన ఇతర వ్యాక్సిన్లతో పొలిస్తే మోడెర్నా వ్యాక్సిన్ మెరుగైన ఫలితాలను నమోదు చేసింది.

శాస్త్రవేత్తలు మోడెర్నా కరోనా వ్యాక్సిన్ సమర్థత గురించి మాట్లాడుతూ వ్యాక్సిన్ ప్రమాణాలకు అనుగుణంగా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకున్నట్టు వెల్లడించారు. డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డ్ కరోనా వ్యాక్సిన్ గురించి ప్రయోగాలు చేసి ఈ విషయాలను వెల్లడించింది. మోడెర్నా సంస్థ అమెరికాలోని దాదాపు 30 వేల మంది వాలంటీర్లకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చి క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహించింది.

అమెరికా ప్రభుత్వం మోడెర్నా సంస్థ కరోనా వ్యాక్సిన్ ప్రయోగాల కోసం 7 వేల కోట్ల రూపాయల సాయం చేసింది. అమెరికా మోడెర్నా సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఆర్థిక సాయం చేసినందు వల్ల మోడెర్నా 10 కోట్ల కరోనా వ్యాక్సిన్లను అమెరికాకు అందించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఫైజర్ సంస్థ 90 శాతం ఖచ్చితత్వంతో తమ వ్యాక్సిన్ పని చేస్తుందని ప్రకటన చేయగా తాజాగా మరో వ్యాక్సిన్ అనుకూల ఫలితాలను సాధించడం గమనార్హం.

మరోవైపు ఇప్పటికే వ్యాక్సిన్లు అనుకూల ఫలితాలను సాధించిన నేపథ్యంలో త్వరలోనే వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఐతే ఉన్నాయని సమాచారం. కరోనా వ్యాక్సిన్ ఎంత త్వరగా అందుబాటులోకి వస్తే అంత త్వరగా మహమ్మారి కట్టడి సాధ్యమవుతుంది.