https://oktelugu.com/

ఎంఐ, రెడ్‌ మీ ఫోన్లు వాడే వాళ్లకు అలర్ట్.. ఎయిర్ టెల్ సిమ్ వాడితే..?

దేశంలో ఎక్కువ మంది వినియోగించే ఫోన్లు ఏవనే ప్రశ్నకు ఎంఐ, రెడ్‌ మీ ఫోన్లు అని ఎవరైనా ఠక్కున చెప్పేస్తారు. తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లు ఉండటం వల్ల ఎంఐ, రెడ్‌ మీ ఫోన్లను వినియోగించడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఫోన్లలో కొత్త సమస్య ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఫోన్లలో ఎయిర్ టెల్ సిమ్ వాడితే ఫోన్ క్రాష్ అవుతోందని కొందరు వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. సాధారణంగా స్మార్ట్ ఫోన్లు క్రాష్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 16, 2020 / 08:14 PM IST
    Follow us on

    దేశంలో ఎక్కువ మంది వినియోగించే ఫోన్లు ఏవనే ప్రశ్నకు ఎంఐ, రెడ్‌ మీ ఫోన్లు అని ఎవరైనా ఠక్కున చెప్పేస్తారు. తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లు ఉండటం వల్ల ఎంఐ, రెడ్‌ మీ ఫోన్లను వినియోగించడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఫోన్లలో కొత్త సమస్య ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఫోన్లలో ఎయిర్ టెల్ సిమ్ వాడితే ఫోన్ క్రాష్ అవుతోందని కొందరు వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు.

    సాధారణంగా స్మార్ట్ ఫోన్లు క్రాష్ కావడం చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది. ఎంఐయూఐ 12.05 గ్లోబల్ స్టేబుల్ రోమ్ ద్వారా ప్రస్తుతం ఈ సమస్య ఎదురవుతుందని తెలుస్తోంది. ఎంఐ, రెడ్‌ మీ ఫోన్లలో ఎయిర్ టెల్ సిమ్ ఉంచితే ఫోన్ తరచూ రీస్టార్ట్ అవుతోందని వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. ఎయిర్ టెల్ ఒక ప్రకటనలో షియోమీ స్మార్ట్ ఫోన్లలో ఉన్న లోపం వల్లే ఈ సమస్య తలెత్తినట్లు తెలిపింది.

    ఈ సమస్య వల్ల ఎంఐ, రెడ్‌ మీ ఫోన్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భారత్, నైజీరియాలోని కస్టమర్లు ఈ సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. షియోమీ సంస్థ ఈ సమస్య గురించి స్పందిస్తూ ఒక్క వారంలో అప్ డేట్ ఇచ్చి ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది. ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్‌ వల్ల ఫోన్లు క్రాష్ అవుతున్న నేపథ్యంలో ఈ యాప్ లో సైతం చిన్నచిన్న మార్పులు జరిగినట్టు సమాచారం.

    అయితే ఎంఐ, రెడ్‌ మీ ఫోన్లు వాడే కొందరికి మాత్రమే ఈ సమస్య ఎదురైనట్టు తెలుస్తోంది. ఈ యాప్ అప్ డేట్ యూజర్లకు ఏ విధంగా అందుబాటులోకి వస్తుందో తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్లు సర్వీస్ సెంటర్ కు వెళ్లి సమస్యను పరిష్కరించుకోవచ్చని సంస్థ తెలిపింది.