Ayodhya Rama Mandir:భారతదేశంలోని కోట్లాది ప్రజల కల అయోధ్యలో రాముడి గుడి చూడాలి. దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న వారికి జనవరి 22న ఈ కల నెరవేరినట్లయింది. అయోధ్యలో ఆలయ నిర్మాణం కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటక ప్రదేశంగా విరజిల్లుతుందని ఇప్పటి వరకు ఎందరో ప్రముఖులు వ్యాఖ్యానించారు. కానీ రోజురోజుకు అయోధ్య రామ మందిరానికి పెరుగుతున్న ఆదరణను చూసి ఈ ఆలయం ప్రపంచంలో పర్యాటక ప్రదేశంగా మారుతుందని అంటున్నారు. ఇందులో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఓ రిపోర్టు బయటపెట్టింది. అయోధ్య రామాలయం చూడడానికి పర్యాటకులు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని, ఇది ఈ ఏడాది చివరి వరకు రూ.4 లక్షల కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. ఆ వివరాల్లోకి వెళితే..
2024 జనవరి 22న అయోధ్యలో బాలరాముడు కొలువయ్యాడు. అంతకుముందు విషయంపై బాగా ప్రచారం కావడంతో ఈ వేడుక కోసం దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రామడి ప్రాణ ప్రతిష్ట కోసం ఎదురుచూశారు. ఈ ఘట్టం పూర్తయిన తరువాత సందర్శకులను అనుమతి ఇవ్వడంతో జనం తండోపతండాలుగా వచ్చారు. ఎవరూ అంచనా వేయని విధంగా గత రెండు రోజులుగా ఆలయం కిక్కిరిపోతుంది. ఈ పరిస్థితిని గమనించిన SBI ఓ నివేదికను బయటపెట్టింది.
ప్రస్తుతం అయోధ్య రామాలయం కోసం ప్రతి సెకనుకు రూ.1.26 లక్షల భక్తులు ఏదో రకంగా ఖర్చు చేస్తారని తెలిపింది. రానున్న రోజల్లో ఉత్తరప్రదేశ్ టూరిజం రాష్ట్రంగా మారనుందని, ఈ రాష్ట్రంలో ఉన్న తాజ్ మహల్, వారణాసి, గంగానదిని చూడడానికి ఇప్పటికే ప్రజలు తరలివస్తున్నారన్నారు. ఇప్పుడు అయోధ్య కూడా తరలి వస్తారని తెలిపింది. 2022 సంవత్సరంలో 32 కోట్ల మంది దేశీయ పర్యాటకులు ఉత్తరప్రదేశ్ కు రాగా అందులో 2.21 కోట్ల మంది అయోధ్యకు రావడం విశేషం అని చెప్పుకొచ్చింది. 2001 సంవత్సరంతో పోలిస్తే ఇది 200 శాతం అని పేర్కొంది.
ఎస్బీఐకి చెందిన డాక్టర్ సౌమ్య కాంతి మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్ కు రావడానికి దేశ ప్రజలు 2022లో 32 కోట్ల మంది 2.2 లక్షల కోట్లు ఖర్చు చేశారని, విదేశీ పర్యాటకులు రూ.10 వేల కోట్లు అని తెలిపారు. అంటే పర్యాటకుల ద్వారా రూ.2.3 లక్షల కోట్లు. అయితే అయోధ్యరామ మందిరం నిర్మాణం తరువాత ఈ ఏడాది చివరి నాటికి 200 శాతం పెరిగితే రూ.4 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది. ఈ కారణంగా దేశ స్థూల జాతీయాదాయంలో ఉత్తర ప్రదేశ్ వాటా 10 శాత పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.