వర్క్ ఫ్రం హోం ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. ఆ సమస్యలు..?

కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల దేశంలోని పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయిన సంగతి తెలిసిందే. దేశంలోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీల నుంచి చిన్నచిన్న కంపెనీల వరకు ప్రతి కంపెనీ లాక్ డౌన్ సమయంలో వర్క్ ఫ్రం హోం ద్వారా ఆఫీస్ వర్క్ చేయించుకుంది. ఉద్యోగుల్లో కొందరు వర్క్ ఫ్రం హోం బాగుందని చెబుతుంటే మరి కొందరు మాత్రం వర్క్ ఫ్రం హోం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. అయితే తాజాగా కొందరు పరిశోధకులు చేసిన అధ్యయనంలో […]

Written By: Navya, Updated On : November 17, 2020 8:18 am
Follow us on

కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల దేశంలోని పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయిన సంగతి తెలిసిందే. దేశంలోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీల నుంచి చిన్నచిన్న కంపెనీల వరకు ప్రతి కంపెనీ లాక్ డౌన్ సమయంలో వర్క్ ఫ్రం హోం ద్వారా ఆఫీస్ వర్క్ చేయించుకుంది. ఉద్యోగుల్లో కొందరు వర్క్ ఫ్రం హోం బాగుందని చెబుతుంటే మరి కొందరు మాత్రం వర్క్ ఫ్రం హోం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.

అయితే తాజాగా కొందరు పరిశోధకులు చేసిన అధ్యయనంలో వర్క్ ఫ్రం హోం చేసే ఉద్యోగులు ఒక మానసిక సమస్యతో ఎక్కువగా బాధ పడుతున్నారని తేలింది. కొందరు ఉద్యోగులు ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఆపరేషన్లు చేయించుకుంటున్నారని తెలుస్తోంది. కరోనా మహమ్మారి వల్ల ఉద్యోగుల విధి నిర్వహణలో మార్పులు రాగా చాలా మంది ఉద్యోగులు జూమ్, ఇతర యాప్ ల ద్వారా ఉద్యోగులు, ఉన్నతాధికారులు, క్లయింట్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో ముఖం అందంగా కనిపించకపోయినా శరీరంలో ఏవైనా లోపాలు ఉన్నా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని డిస్మోర్ఫియా బారిన పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని పరిశోధనలో తేలింది. గతంలో ఉద్యోగులు ఆఫీస్ లకు రోజూ వెళ్లేవాళ్లు కాబట్టి తమ ముఖం లేదా శరీరంలోని లోపాల గురించి పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదు. వీడియో సమావేశాల్లో ఉద్యోగులు ముఖం చూసుకుంటూ ఉండటంతో వాళ్లలో డిస్మోర్ఫియా లక్షణాలు కనిపిస్తున్నాయని సమాచారం.

వర్క్ ఫ్రమ్ చేసే ఉద్యోగులు గూగుల్ సెర్చ్ లో ఎక్కువగా ఆక్నే, హెయిర్ లాస్ వంటి అందానికి సంబంధించిన పదాల గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారని సమాచారం. వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు ముడతలు తొలగించుకోవడం లేదా ముక్కు సరి చేయించుకోవడం చేస్తున్నారని తెలుస్తోంది.