Pawan Kalyan Ram Mandir :ప్రపంచమంతా భారత్ వైపు చూసేలా అయోధ్య రామాలయం ప్రఖ్యాతి గాంచింది. ఈనెల 22న ప్రాణ ప్రతిష్ట జరిగనప్పటి నుంచి ఆయోధ్య గురించి నిత్యం చర్చ సాగుతూనే ఉంది. ప్రాణ ప్రతిష్ట రోజు ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడి రాముడి దర్శనం చేసుకున్నారు. ఆ తరువాత రోజు నుంచి సామన్య భక్తులు బాల రామయ్యను తనినితీరా చూస్తున్నారు. ఎన్నోఅడ్డంకులు, మరెన్నో వివాదాల నడుమ పూర్తి చేసుకున్న ఈ ఆయల నిర్మాణం కోసం దేశంలోని పలువురు ప్రముఖులు విరాళాలు అందించారు. వీరిలో తెలుగువారు కూడా ఉన్నారు. అయితే ఇటీవల పవన్ కల్యాణ్ ఇచ్చిన విరాళంపై ఆసక్తి చర్చ సాగుతోంది. ఇంతకీ పవన్ బాల రామయ్యకు ఎంత విరాళం ఇచ్చాడంటే?
సినీ నటుడు, జనసేన అధినేత అయిన పవన్ కల్యాణ్ రాజకీయంగా దినదినాభివృద్ధి చెందుతున్నాడు. పలు సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక వాతావరణంలో పాల్గొంటున్నారు. తాజాగా అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి పవన్ కల్యాణ్ కు అందరి కంటే ముందుగానే ఆహ్వానం అందింది. దీంతో తనకు వచ్చిన అవకాశాన్ని పవన్ ఏమాత్రం వదులుకోలేదు. అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట కోసం ఆయన అయోధ్యకు వెళ్లి సందడి చేశారు. ఇక్కడికి వచ్చిన ఆయన అన్నమెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని కలిశారు. వారితో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఇచ్చిన విరాళంపై ఆసక్తిగా చర్చ సాగుతోంది.
ఆయోధ్య రామమందిరం నిర్మాణానికి దేశంలోని ప్రముఖులు తమ వంతు సాయం చేశారు. ఈ ఆలయంలో బంగారు ఇటుకల నిర్మాణానికి బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ విరాళం అందించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ రూ.30 లక్షల విరాళం అందించారు. ఇప్పటి వరకు ఇచ్చిన విరాళాల్లో పవన్ కల్యాణ్ ఇచ్చిన విరాళం హైలెట్ గా నిలుస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచి మెగా కుటుంబతో పాటు ప్రభాస్ ఈ కార్యక్రమానికి హాజరైంది. ప్రభాస్ తన వంతు సాయంగా గతంలో రూ.10 లక్షలు అందిచారు. అలాగే హనుమాన్ సినిమా టీం కలిసి రూ.10 లక్షలు అందించారు.
అయితే పవన్ కల్యాణ్ ఒక్కరే రూ.30 లక్షలు విరాళం ఇవ్వడంపై ఆసక్తిగా చర్చ సాగుతోంది. రాముడిపై తనకున్న భక్తి తోనే ఆయన ఇంత విరాళం ఇచ్చాడని ఆయన ఫాన్స్ అంటున్నారు. అలాగే భవిష్యత్ లో రామయ్య ఆశీస్సులు పవన్ కు తప్పకుండా ఉంటాయని అంటున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా పోస్టులు పెడుతున్నారు. ఇక ఆయోధ్య బాల రాముడిని చూసేందుకు జనం కిక్కిరిపోతున్నారు. ఇన్నాళ్లు పలు మాధ్యమాల ద్వారా తిలకించిన రామయ్యను నేరుగా చూసేందుకు తరలివస్తున్నారు.