పెళ్లి కాకముందు హా..హా హాసిని అంటే గుర్తొచ్చేది జెనీలియా.. ఆమె తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో హుషారెత్తించే పాత్రల్లో నటించి మెప్పించింది.
అయితే బాలీవుడ్ హీరో ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది. పైగా రాజకీయ కుటుంబం కూడా కావడంతో ఇక సినిమాలేవీ చేయకుండా సంసార పక్షం వహించింది.
తాజాగా జెనీలియా ఇన్ స్టాగ్రామ్ లో భర్తతో కలిసి పలు ఫొటోలు, వీడియోలు షేర్లు చేస్తూ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే షాకింగ్ ఫొటో ఒకటి బయటపెట్టింది.
తన టాప్ ను విప్పి చూపిస్తూ ‘నన్ను చదవకండి’ అంటూ ఆకట్టుకునేలా ఒక రోమాంటిక్ ఫొటోను షేర్ చేసింది జెనీలియా.. భర్త, కుమారుడు ఉండగా ఇలాంటి ఫొటోను నెటిజన్లతో పంచుకొని జెనీలియా షాక్ ఇచ్చింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘ఏంటి జెనీలియా’ ఇది అంటూ నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.