జగన్ కుర్చీ సేఫ్..!

“సుప్రీం కోర్టు లోని ఓ న్యాయమూర్తి.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ప్రభావితం చేస్తున్నారు” అంటూ.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జస్టిస్ ఎన్వీ రమణపై సీఎం జగన్ ఈ ఆరోపణలు చేశారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్వోన్నత న్యాయస్థానంలోని ఓ న్యాయమూర్తిపై అభియోగాలు మోపుతూ ప్రధాన న్యాయమూర్తికి లేఖ ఇవ్వడం ఇదే తొలిసారి. ఈ చర్య న్యాయ వ్యవస్థ స్వతంత్రతను సవాల్ చేయడమేనని, దీని వల్ల జగన్ […]

Written By: Neelambaram, Updated On : December 9, 2020 12:03 pm
Follow us on


“సుప్రీం కోర్టు లోని ఓ న్యాయమూర్తి.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ప్రభావితం చేస్తున్నారు” అంటూ.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జస్టిస్ ఎన్వీ రమణపై సీఎం జగన్ ఈ ఆరోపణలు చేశారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్వోన్నత న్యాయస్థానంలోని ఓ న్యాయమూర్తిపై అభియోగాలు మోపుతూ ప్రధాన న్యాయమూర్తికి లేఖ ఇవ్వడం ఇదే తొలిసారి. ఈ చర్య న్యాయ వ్యవస్థ స్వతంత్రతను సవాల్ చేయడమేనని, దీని వల్ల జగన్ ముఖ్యమంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యే అవకాశం ఉందని చాలా మంది అంచనా వేసుకున్నారు. పదవీ గండం తప్పదని విశ్లేషకులు కూడా భావించారు.

Also Read: చంద్రబాబు విశ్వసనీయతను ప్రజలు నమ్మడం మానేశారా?

టీడీపీ నేతల పట్టు..

ఇక, టీడీపీ నేతలైతే.. విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ న్యాయవ్యవస్థను అవమానించారని, ఇలాంటి వ్యక్తిని సీఎం పదవి నుంచి తొలగించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఢిల్లీకి వెళ్లి మరీ ఈ కేసును ఫాలో అప్ చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలను జగన్ నాశనం చేస్తున్నారని, న్యాయవ్యవస్థను కూడా శాసించడానికే ఈ లేఖ రాశారని టీడీపీ పదే పదే ఆరోపించింది. యనమల రామకృష్ణుడు వంటి సీనియర్ నేతలయితే వెంటనే జగన్ పై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరారు. అంతే కాకుండా.. వివిధ రాష్ట్రాలకు చెందిన న్యాయవాదులను సైతం టీడీపీ రంగంలోకి దించింది. తమిళనాడుకు చెందిన మణి, మరో న్యాయవాది సునీల్ సింగ్ లు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జగన్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని కోరారు. అంతేకాదు.. లేఖను బహిర్గతం చేసినందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కూడా పిటీషన్ లలో కోరారు.

ఆశలు అడియాసలు…

నిజానికి ఈ కేసులో జగన్ కు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని టీడీపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ.. సుప్రీంకోర్టు మాత్రం ఈ పిటీషన్లను తోసిపుచ్చింది. ముఖ్యమంత్రి జగన్ ను పదవి నుంచి తొలగించాలంటూ దాఖలు చేసిన పిటీషన్ కు విచారణ అర్హత లేదని స్పష్టం చేసింది. దీంతో తెలుగు దేశం పార్టీ నేతల ఆశలు ఆవిరయ్యాయి.

Also Read: హైకోర్టులో జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ.. ‘పంచాయతీ’కి లైన్ క్లియర్..!

చీఫ్ జస్టీస్ స్పందన ఎలా ఉంటుందో..?

జగన్ ను పదవీచ్యుతున్ని చేయాలన్న పిటీషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. మరి, రాష్ట్ర హై కోర్టును సుప్రీం న్యాయమూర్తి ప్రభావితం చేస్తున్నారంటూ జగన్ రాసిన లేఖ పై ఎలా స్పందిస్తారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరి, ప్రధాన న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్