జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. మొత్తం 150 స్థానాలకు గాను నేడు 149స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. ఒక్క నేరేడ్ మెట్ డివిజన్లో మాత్రం ఫలితాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ స్థానంలో స్వస్తిక్ గుర్తు కంటే మిగతా ముద్ర ఓట్లు ఎక్కువగా ఉండటంతో లెక్కింపు వాయిదా పడింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు నిర్ణయం తీసుకోనున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
Also Read: ఫలితాలపై నిరాశ లేదంటునే మెలిక పెట్టిన మంత్రి కేటీఆర్..!
మిగతా 149 స్థానాలకు గాను టీఆర్ఎస్ 55.. బీజేపీ 48.. ఎంఐఎం 44.. కాంగ్రెస్ 2స్థానాల్లో గెలిచాయి. ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో జీహెచ్ఎంసీలో హంగ్ ఏర్పడింది. అయితే జీహెచ్ఎంసీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రం టీఆర్ఎస్ ఉండటంతో ఆ పార్టీకే మేయర్ పీఠం దక్కే అవకాశాలున్నాయి.
సీఎం కేసీఆర్ మాత్రం ఫలితాలతో సంబంధం లేకుండా మేయర్ ఎంపికపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఈసారి మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వు కావడంతో ఆ స్థానాన్ని ఓసీ మహిళతో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ముగ్గురు మహిళలు రేసులో ఉండగా సీఎం కేసీఆర్ నుంచి ఒకరికి పిలుపు వచ్చినట్లు సమాచారం.
Also Read: ఢిల్లీ నుంచి రేవంత్ కు పిలుపు.. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపేందుకేనా?
టీఆర్ఎస్ నుంచి సింధు ఆదర్శ్ రెడ్డితోపాటు రాజ్యసభ ఎంపి కే.కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మీ.. మాజీ మంత్రి పీజేఆర్ కూతురు విజయారెడ్డి తదితరులు గెలుపొందారు. వీరిలో నుంచి సింధు ఆదర్శ్ రెడ్డికి ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. సింధు ఆదర్శ్ రెడ్డి భారతీనగర్ డివిజన్ నుంచి వరుసగా రెండోసారి గెలుపొందారు. సీఎం నుంచి ఆమెకు పిలుపు రావడంతో సింధు ఎంపిక లాంఛనమేననే టాక్ విన్పిస్తోంది.
ఇక డిప్యూటి మేయర్ రేసులో బాబా ఫసీయుద్దీన్ పేరు విన్పిస్తోంది. ఫసీయుద్దీన్ సైతం బోరబండ డివిజన్ నుంచి రెండోసారి గెలుపొందాడు. టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ సైతం మేయర్ లేదా డిప్యూటి మేయర్ పదవీని డిమాండ్ చేసే అవకాశం ఉంది. దీంతో మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్