https://oktelugu.com/

ఫలితాలపై నిరాశ లేదంటునే మెలిక పెట్టిన మంత్రి కేటీఆర్..!

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు నేడు విడుదయ్యాయి. మొత్తం 150డివిజన్ల ఫలితాలు సాయంత్రం వరకు వెలువడ్డాయి. టీఆర్ఎస్.. బీజేపీ.. ఎంఐఎంలు పోటాపోటీగా సీట్లు గెలుచుకోవడంతో జీహెచ్ఎంసీలో హంగ్ పరిస్థితులు ఏర్పడ్డాయి. Also Read: ఢిల్లీ నుంచి రేవంత్ కు పిలుపు.. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపేందుకేనా? ఈ ఫలితాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మీడియా ముఖంగా స్పందించారు. జీహెచ్ఎంసీ ఫలితాలు తాము ఆశించిన విధంగా రాలేదన్నారు. మరో 25నుంచి 30సీట్లు వస్తాయని భావించినట్లు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 4, 2020 / 09:59 PM IST
    Follow us on

    జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు నేడు విడుదయ్యాయి. మొత్తం 150డివిజన్ల ఫలితాలు సాయంత్రం వరకు వెలువడ్డాయి. టీఆర్ఎస్.. బీజేపీ.. ఎంఐఎంలు పోటాపోటీగా సీట్లు గెలుచుకోవడంతో జీహెచ్ఎంసీలో హంగ్ పరిస్థితులు ఏర్పడ్డాయి.

    Also Read: ఢిల్లీ నుంచి రేవంత్ కు పిలుపు.. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపేందుకేనా?

    ఈ ఫలితాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మీడియా ముఖంగా స్పందించారు. జీహెచ్ఎంసీ ఫలితాలు తాము ఆశించిన విధంగా రాలేదన్నారు. మరో 25నుంచి 30సీట్లు వస్తాయని భావించినట్లు తెలిపారు.

    ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా టీఆర్ఎస్ కే అనుకూలంగా వచ్చాయని కేటీఆర్ గుర్తు చేశారు. కొన్నిచోట్ల స్పల్ప ఓట్లతో టీఆర్ఎస్ ఓడిపోవడాన్ని ఆయన గుర్తు చేశారు. బీఎన్ రెడ్డి కాలనీలో కేవలం 18 ఓట్లతో.. .మౌలాలీలో 200.. మాల్కాజ్ గిరిలో 70.. అడిక్ మెట్ లో 200.. మూసాపేట్లో 100 ఇలా 12 చోట్ల టీఆర్ఎస్ స్వల్ప ఓట్లతో ఓడిపోయిందని తెలిపారు.

    Also Read: జీహెచ్ఎంసీ ఎఫెక్ట్: కేటీఆర్ సీఎం, కేసీఆర్ పీఎం కల చెదిరినట్టేనా?

    గ్రేటర్ ఫలితాలపై పార్టీలో సమీక్షించుకొని భవిష్యత్ లో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా మేయర్ ఎవరని మీడియా ప్రశ్నించగా కేటీఆర్ దాటవేశారు. మేయర్ పై ఇప్పుడే తొందరెందుకు.. ఇంకా సమయం ఉందని వ్యాఖ్యనించారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్