https://oktelugu.com/

బీజేపీలోకి మాజీ మంత్రి.. చేరికలకు రంగం సిద్ధం?

తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికలు బీజేపీకి ఫుల్ జోష్ ను తెచ్చిపెట్టాయి. దుబ్బాక.. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి పోటీ ఇవ్వడం ఆపార్టీకి కలిసొచ్చింది. ఈ రెండు ఎన్నికలతో తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అన్న టాక్ నడుస్తోంది. ఈ జోష్ ను కంటిన్యూ చేసేలా బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. Also Read: కోదండరాం ఎందుకు సైలంట్ అయ్యారు.. బరిలో నిలిచేనా? దీనిలో భాగంగా తెలంగాణలోని ప్రముఖులు.. ఇతర పార్టీ నేతలను […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 11, 2020 / 06:06 PM IST
    Follow us on

    తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికలు బీజేపీకి ఫుల్ జోష్ ను తెచ్చిపెట్టాయి. దుబ్బాక.. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి పోటీ ఇవ్వడం ఆపార్టీకి కలిసొచ్చింది. ఈ రెండు ఎన్నికలతో తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అన్న టాక్ నడుస్తోంది. ఈ జోష్ ను కంటిన్యూ చేసేలా బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు.

    Also Read: కోదండరాం ఎందుకు సైలంట్ అయ్యారు.. బరిలో నిలిచేనా?

    దీనిలో భాగంగా తెలంగాణలోని ప్రముఖులు.. ఇతర పార్టీ నేతలను బీజేపీలో చేర్చుకుంటున్నారు. ఇటీవలే కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా కొనసాగిన సినీ నటి విజయశాంతి బీజేపీలో చేర్చుకొని ఆ పార్టీకి షాకిచ్చింది. రాములమ్మతో ప్రారంభమైన చేరికలను బీజేపీ అలానే కంటిన్యూ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోని టీఆర్ఎస్.. కాంగ్రెస్ లోని నేతలతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు.

    బీజేపీలోకి తాజాగా మాజీ మంత్రి డా.ఎ.చంద్రశేఖర్ చేరుతారనే ప్రచారం జరుగుతోంది. సీఎం కేసీఆర్ సన్నిహితంగా ఉండే చంద్రశేఖర్ టీఆర్ఎస్ లో ఓ వెలుగు వెలిగారు. అయితే కొన్ని కారణాలతో కిందటి ఎన్నికల్లో టీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరారు. పెద్దపల్లి నుంచి పోటీచేసిన చంద్రశేఖర్ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు.

    Also Read: గ్రేటర్లో ఆపరేషన్ ఆకర్ష్.. ఏ పార్టీకి కలిసొచ్చేనో?

    ప్రస్తుతం కాంగ్రెస్ బలహీనంగా ఉండటంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారనే టాక్ విన్పిస్తోంది. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి డీకే అరుణ ఇప్పటికే చంద్రశేఖర్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే చంద్రశేఖర్ బీజేపీలో చేరేందుకు అంగీకరించారనే ప్రచారం జరుగుతోంది. వికరాబాద్ లో త్వరలో జరిగే భారీబహిరంగలో ఆయన కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.

    ఇక ఆయనతోపాటు మరో సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ కూడా కాషాయ కండువా కప్పుకోనున్నారనే టాక్ విన్పిస్తోంది. 2023లోగా బీజేపీ తెలంగాణ వ్యాప్తంగా బలపడాలనే లక్ష్యంగా అధిష్టానం ఈ మేరకు చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే తెలంగాణ బీజేపీ నేతలు ఇతర పార్టీలోని బలమైన నేతలను తమవైపు ఆకర్షించే పనిలో పడ్డారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్