
టీఆర్‌ఎస్‌తో బీజేపీకి రాజకీయ చీకటి ఒప్పందం ఉందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఇక్కడ బీజేపీని విమర్శిస్తారు.. ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలుస్తారని విమర్శించారు. కేసీఆర్ కొత్త సచివాలయాన్ని కడుతున్నందునే.. మోదీ నిర్మిస్తున్న పార్లమెంట్ భవనాన్ని సమర్థిస్తున్నారని చెప్పారు. ఆరేళ్లుగా సంగారెడ్డికి నిధులు ఇవ్వడం లేదని, కేసీఆర్ లేనిదే తెలంగాణ లేదనడం అవాస్తవమని జగ్గారెడ్డి కొట్టిపారేశారు. ఇది కేసీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ తెలంగాణ ఇవ్వకపోతే ఈ రోజు కేసీఆర్ ఇలా మాట్లాడేవాడా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.