
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతూనే ఉంది.. పలు దఫాలుగా కేంద్ర సర్కార్, రైతుల మధ్య జరిగిన చర్చలు విఫలం కాగా.. కేంద్రం చేసిన ఎనిమిది ప్రతిపాదనలు కూడా రైతులు వ్యతిరేకించారు. దీంతో.. కేంద్రం, రైతుల చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది.. ఇదే సమయంలో.. ఆందోళనను మరింత ఉధృతం చేయాలని భావిస్తున్న రైతులు.. భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. అయితే, చర్చలకు రావాలంటూ రైతులకు విజ్ఞప్తి చేశారు కేంద్ర వ్యవసాయం మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. రైతులు ఆందోళనను విరమించాలన్న ఆయన.. చర్చల్లో ప్రతిష్టంభనను తొలగించాలని రైతులను కోరారు.