వైసీపీలో వర్గ విభేదాలు.. కొట్టుకుంటున్న నేతలు

కర్నూలు జిల్లాలో పార్టీ వ్యవహారాలు ఎలా ఉన్నాయి? సమన్వయంతో పాలన ముందుకు సాగుతుందా? అంటే పూర్తిస్థాయిలో ఏదీ కూడా స్పష్టత కనిపించడం లేదు. పాలకపక్షంలో పెత్తనం పోరు పెరుగుతోంది. ప్రజలు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టారు. కొన్ని నియోజకవర్గాల్లో ఊహించని మెజార్టీలు వచ్చాయి. జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో వైసీపీకి ఓట్ల వర్షం కురిసింది. ప్రజల ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రజల ఆకాంక్షలు తీరుతున్నాయా? అంటే.. నవరత్నాలు మాత్రం అమలు జరుగుతున్నాయి. రాజకీయంగా […]

Written By: NARESH, Updated On : December 6, 2020 2:33 pm
Follow us on

ap ycp flag

కర్నూలు జిల్లాలో పార్టీ వ్యవహారాలు ఎలా ఉన్నాయి? సమన్వయంతో పాలన ముందుకు సాగుతుందా? అంటే పూర్తిస్థాయిలో ఏదీ కూడా స్పష్టత కనిపించడం లేదు. పాలకపక్షంలో పెత్తనం పోరు పెరుగుతోంది. ప్రజలు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టారు. కొన్ని నియోజకవర్గాల్లో ఊహించని మెజార్టీలు వచ్చాయి. జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో వైసీపీకి ఓట్ల వర్షం కురిసింది. ప్రజల ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రజల ఆకాంక్షలు తీరుతున్నాయా? అంటే.. నవరత్నాలు మాత్రం అమలు జరుగుతున్నాయి. రాజకీయంగా చూస్తే పాలకపక్ష నేతల తీరు జిల్లాలో పెద్దఎత్తున చర్చగా మారింది. రాజకీయంగా కొన్ని తప్పిదాలు కూడా పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు దారితీశాయి. అధికారం.. పదవుల పందేరం. కాంటాక్టులు.. పనుల కోసం వెంపర్లాడుతున్నారు. ఇక్కడే నేతలు జనానికి దూరమవుతున్నారు.

Also Read: పొత్తు పెట్టుకున్న పార్టే.. పవన్‌కు బ్రేకులు వేస్తుందా..?

కోడుమూరు శాసనసభ్యుడు సుధాకర్ నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్ష వర్థన్ రెడ్డి మధ్య సమన్వయ సంబంధాలు పూర్తిగా బెడిసికొట్టాయని తెలుస్తొంది. శాసన సభ్యుడిగా ఉన్న సుధాకర్ మాట సాగనివ్వడం లేదని అతడి ప్రాముఖ్యతను తగ్గిస్తూ వస్తున్నారని ఎమ్మెల్యే సుధాకర్ ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంతో అనుభవం ఉన్న నియోజకవర్గ శాసన సభ్యుడు సరైన సమన్వయం చేసుకోక పోతున్నాడని ప్రత్యారోపణ చేస్తున్నారు. హర్షవర్ధన్ వర్గీయులు.

కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ ఒంటరి పోరు సాగిస్తున్నారని అంటున్నారు. మండల స్థాయి నాయకులు మాత్రమే ఆయన వెంట నడవగా, నియోజకవర్గంలో కొంతమంది సహకరించడం లేదని చెబుతున్నారు. ఎమ్మెల్యే పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేస్తున్నారు. నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి వెనుకే పార్టీలోని కొంతమంది నేతలు ఉండడంతో కోడుమూరు వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. నియోజకవర్గంలో కోట్ల హర్ష వర్సెస్ ఎమ్మెల్యే సుధాకర్ అన్న రీతిలో వైసీపీ కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుండడం చర్చనీయాంశం అయ్యింది.

ఇద్దరి మధ్య విభేదాలు ఏ స్థాయికి చేరాయంటే ఎమ్మెల్యేకు తెలియకుండానే కోట్ల హర్ష సమక్షంలో ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి చేరుతున్నారు. అధికారులు ఎమ్మెల్యే సిఫారసుల కంటే హర్ష చెప్పిన పనులకే ప్రాధాన్యం ఇస్తున్నారట. దీంతో ఎవరి పక్షాన వెళ్లాలో కార్యకర్తలకు దిక్కు తోచడం లేదని అంటున్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం అందరినీ ఏకతాటిపై తెచ్చేందుకు సుధాకర్ ప్రయత్నిస్తున్నా కోట్ల హర్ష అనుచరులు మాత్రం సహకరించడం లేదని గుసగుసలు వినిలపిస్తున్నాయి.

నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, ఇన్‌చార్జి బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి వర్గీయులు మరోసారి రచ్చకెక్కారు.. కర్నూలుకు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో వైసీపీ నేతల మధ్య విభేదాలను బయటపెట్టాయి. అభ్యర్థుల ఎంపికే నేతల మధ్య ఆధిపత్య పోరుకు వేదికైంది. కర్నూలులోని ఓ హోటల్లో మంత్రి అనిల్‌కుమార్‌, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు కసరత్తు చేస్తుండగా, బయట నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌ వర్గీయులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ఆర్థర్‌కు బి ఫారాలు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారంటూ నినాదాలు చేశారు ఆయన వర్గీయులు. అయితే, నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్థర్, ఇన్‌చార్జి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి చెరో మూడు మండలాలు అప్పగించారు పార్టీ పెద్దలు. వీటికి అభ్యర్థుల ఎంపిక బాధ్యతను వాళ్లకే ఇచ్చారు.

Also Read: ఏపీలో జగన్: తిరుపతి’లో బీజేపీతో సాధ్యమేనా?

కానీ, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నాలుగు మండలాలు కావాలంటున్నారని ఆరోపించింది ఆర్థర్‌ వర్గం. దళిత ఎమ్మెల్యేకు అన్యాయం చేస్తున్నారంటూ చేపట్టిన ఈ ఆందోళన… ఒక దశలో ఉద్రిక్తలకు దారితీసింది. ఆర్థర్, సిద్ధార్థరెడ్డి వర్గీయులు ఒకరినొకరు నెట్టుకుని, కొట్టుకునే వరకు వెళ్లింది. అయితే, పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. హోటల్ ఎదుట ఆందోళన కొనసాగుతుండగానే… అభ్యర్థుల ఎంపిక సమావేశం నుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్యే అర్థర్. సిద్ధార్థ రెడ్డికి 4 మండలాలు ఇస్తే… తనకు అసలేమీ అవసరంలేదని, అన్ని మండలాలకు అభ్యర్థుల్ని మీరే ఎంపిక చేసుకోండి అంటూ వెళ్లిపోయారు. తన దారి తాను చూసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ఎమ్మెల్యే ఆర్థర్ వెళ్లిపోయాక అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగింది. ఎమ్మెల్యే ఆర్థర్ ఏ నిర్ణయం తీసుకుంటారు? ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనే ఉత్కంఠ నెలకొంది.

జిల్లాలో కర్నూలు ఎమ్మెల్యే మహ్మద్ హఫీజ్ ఖాన్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయినట్టు జిల్లా రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో కర్నూలు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డి విజయం సాధించారు. ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో ఆయన టిడిపిలోకి జంప్ చేసేశారు.

ఎన్నికలకు ముందు చంద్రబాబు మోహన్ రెడ్డికి సీటు ఇవ్వలేదు. దీంతో ఆయన తిరిగి వైసీపీ గూటికి రివర్స్ జంప్ చేసేశారు. ఎన్నికల్లో హఫీజ్ ఖాన్ గెలుపుకోసం ఎస్వీ మోహన్ రెడ్డి కష్టపడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తనకున్న పరిచయాలను వాడి మరి హఫీజ్ ఖాన్ విజయంలో తనదైన వ్యూహాలు పన్నారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి టీజీ. భరత్ పై హఫీజ్ ఖాన్ విజయం సాధించారు. తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలిచిన హఫీజ్ ఖాన్ గెలిచిన నెల రోజులకే నగర బాట పట్టారు. ప్రతిరోజు రెండు వార్డుల్లో తిరుగుతూ అక్కడ ప్రజల సమస్యలను నోట్ చేసుకుని వాటిని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు.

ఇక ఈ వ్యవహారమంతా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వద్దకు చేరింది. ఇక వీరి ఘర్షణలపై సీరియస్ గా ఉన్న జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారో అనేది వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్