https://oktelugu.com/

పొత్తు పెట్టుకున్న పార్టే.. పవన్‌కు బ్రేకులు వేస్తుందా..?

జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్న అందరికీ తెలిసిందే. హైదరాబాద్‌ గ్రేటర్‌‌ ఎన్నికల్లోనూ ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కమలం పార్టీకి మద్దతు తెలిపారు. కానీ, బీజేపీ తీరే వివాదాస్పదం అవుతోంది. పవన్ హైలెట్‌ కాకుండా పార్టీ లీడర్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. మొన్నటి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ మాట్లాడుతూ తాము ఎవరినీ అడగలేదని, జనసేన పార్టీయే తమ వద్దకు వచ్చి పొత్తు పెట్టుకున్నదని వ్యాఖ్యానించారు. ఏపీలోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. Also Read: […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 6, 2020 / 02:11 PM IST
    Follow us on


    జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్న అందరికీ తెలిసిందే. హైదరాబాద్‌ గ్రేటర్‌‌ ఎన్నికల్లోనూ ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కమలం పార్టీకి మద్దతు తెలిపారు. కానీ, బీజేపీ తీరే వివాదాస్పదం అవుతోంది. పవన్ హైలెట్‌ కాకుండా పార్టీ లీడర్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. మొన్నటి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ మాట్లాడుతూ తాము ఎవరినీ అడగలేదని, జనసేన పార్టీయే తమ వద్దకు వచ్చి పొత్తు పెట్టుకున్నదని వ్యాఖ్యానించారు. ఏపీలోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి.

    Also Read: అంతా నేనే చేశానంటున్న బాబు

    పవన్‌కు పోటీగా ప్రోగ్రామ్స్‌

    ఏపీలో పవన్ కల్యాణ్ వరద బాధితులను పరామర్శించేందుకు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఈ పర్యటనల్లో ఒక్కసారి కూడా పాలుపంచుకోని బీజేపీ ఇప్పుడు సొంతంగా ఓ ప్రోగ్రాం చేపట్టడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ తీరుపై ఇన్నాళ్లు ఒక్కసారి కూడా రోడ్డెక్కని కమలదళం.. ఇప్పుడు రోడ్లపేరిట ఆందోళనలు చేస్తోంది. రోడ్లు బాగోలేవంటూ రాస్తారోకోలు చేపట్టడం చర్చనీయాంశం అయ్యింది.

    కలిసి చేయాల్సింది పోయి..

    ఏపీలో జనసేన, బీజేపీ రెండు ప్రతిపక్షాలే.. పైగా పొత్తులో ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ప్రోగ్రాం తీసుకుంటే కలిసి నిరసన తెలపాలి. కానీ, ఎవరికి వారే అన్నట్లు కార్యక్రమాలు చేస్తుండడంతో క్యాడర్‌‌ సైతం దిక్కుతోచని స్థితిలో ఉన్నది. ఇన్నాళ్లు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే ఏ ప్రోగ్రామ్‌ను బీజేపీ నేతలు చేపట్టలేదు. ఇప్పుడు పవన్ కల్యాణ్ రంగంలోకి దిగడంతో.. ఆయనను కార్నర్‌‌ చేసేందుకు రోడ్ల పేరిట రాజకీయం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

    Also Read: జగన్‌కు మహిళలు జై… సైలెంట్‌గా రిపోర్టులు!

    తిరుపతితో మద్దతివ్వాలంటున్న బీజేపీ నేతలు

    తిరుపతి బై ఎలక్షన్‌ విషయంలోనూ.. బీజేపీ నేతలు పవన్‌ను తీసేసినట్లుగా మాట్లాడుతున్నారు. తామే పోటీ చేస్తామని పవన్ మద్దతుఇవ్వాల్సిందే అని చెబుతున్నారు. కానీ, పవన్ మాత్రం తామే పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో సత్తా చూపలేకపోయిన జనసేన.. తిరుపతి బై ఎలక్షన్ బరిలో నిలివాలని భావిస్తోంది. చూద్దాం.. చర్చలు దాటుకొని పోటీకి వస్తారా…? గ్రేటర్‌‌లో లెక్క మద్దతిస్తారా..!

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్