https://oktelugu.com/

పవన్ ‘వకీల్ సాబ్’ రిలీజ్ ఎప్పుడంటే !

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ “వకీల్ సాబ్” రాబోయే సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. కానీ, థియేటర్ వ్యాపారం జనవరి కల్లా పుంజుకోదు కాబట్టి, సినిమా సమ్మర్ కి వాయిదా పడిందని తెలుస్తోంది. ఐతే, సమ్మర్ కి చాలా సినిమాలు రానున్నాయి. అందుకే, ఫస్ట్ బిగ్ రిలీజ్ అడ్వాంటేజ్ ను తానే తీసుకోవాలని దిల్ రాజు ప్లాన్ చేసుకుంటున్నాడు. కాబట్టి, వేసవి సెలవల్లో అన్నిటికన్నా ముందే […]

Written By:
  • admin
  • , Updated On : December 6, 2020 / 02:21 PM IST
    Follow us on


    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ “వకీల్ సాబ్” రాబోయే సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. కానీ, థియేటర్ వ్యాపారం జనవరి కల్లా పుంజుకోదు కాబట్టి, సినిమా సమ్మర్ కి వాయిదా పడిందని తెలుస్తోంది. ఐతే, సమ్మర్ కి చాలా సినిమాలు రానున్నాయి. అందుకే, ఫస్ట్ బిగ్ రిలీజ్ అడ్వాంటేజ్ ను తానే తీసుకోవాలని దిల్ రాజు ప్లాన్ చేసుకుంటున్నాడు. కాబట్టి, వేసవి సెలవల్లో అన్నిటికన్నా ముందే రిలీజ్ అయ్యే మూవీ ‘వకీల్ సాబ్’ అని టాక్.

    Also Read: బిగ్ బాస్ ట్విస్ట్: షో నుంచి ఊహించని కంటెస్టెంట్ ఔట్.. ఎవరంటే?

    కాగా ఉగాది కానుకగా ఈ సినిమా రిలీజ్ అవొచ్చు. సంక్రాంతికి ఈ విషయంలో దిల్ రాజ్ ఒక ప్రకటన చేస్తాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. వేణు శ్రీరామ్ డైరెక్టర్ గా ఈ సినిమా కథ గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. కథలో పవన్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడని.. ప్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్రలోనూ.. అలాగే లైవ్ లో వచ్చే కొడుకు పాత్రలోనూ పవన్ కళ్యాణ్ కనిపిస్తాడని సమాచారం.

    Also Read: లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ కి నో చెప్పిన అనసూయ !

    ఏది ఏమైనా ఈ సినిమా పై మాత్రం పవన్ ఫ్యాన్స్ ముందు నుండి బాగా ఆసక్తి చూపిస్తున్నారు. అన్నట్లు ఈ సినిమా తరువాత పవన్, క్రిష్ అండ్ హరీష్ శంకర్ సినిమాల్లో నటిస్తున్నాడు. మెయిన్ గా హరీష్ శంకర్ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. గతంలో హరీష్, పవన్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ పవన్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోవడంతో వీరి కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్