https://oktelugu.com/

మందుబాబులకు సీపీ సజ్జనార్ వార్నింగ్..!

తెలంగాణలోని మందుబాబులకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. సైబరాబాద్ పరిధిలో డ్రైంకన్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే పదేళ్ల జైలు శిక్షపడేలా చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. Also Read: సంక్షేమ పథకాల్లో భారీ మార్పుల దిశగా కేసీఆర్‌‌ కరోనా నిబంధనలు పాటిస్తూ న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవాలని ప్రభుత్వం తరుఫున పోలీసులు ఇప్పటికే ప్రకటనలు చేశారు. న్యూఇయర్ సందర్భంగా డ్రంకెన్ డ్రైవ్ లు చేయనున్నట్లు సీపీ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 29, 2020 / 02:28 PM IST
    Follow us on


    తెలంగాణలోని మందుబాబులకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. సైబరాబాద్ పరిధిలో డ్రైంకన్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే పదేళ్ల జైలు శిక్షపడేలా చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

    Also Read: సంక్షేమ పథకాల్లో భారీ మార్పుల దిశగా కేసీఆర్‌‌

    కరోనా నిబంధనలు పాటిస్తూ న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవాలని ప్రభుత్వం తరుఫున పోలీసులు ఇప్పటికే ప్రకటనలు చేశారు. న్యూఇయర్ సందర్భంగా డ్రంకెన్ డ్రైవ్ లు చేయనున్నట్లు సీపీ సజ్జనార్ ఇప్పటికే ప్రకటించారు.

    దీనిలో భాగంగానే నిన్న ఒక్కరోజు చేపట్టిన డ్రంకెన్ డ్రైవ్ టెస్టులో 402మంది పట్టుబడినట్లు సజ్జనార్ తెలిపారు. తాగి వాహనం నడిపే వాళ్లంతా టెర్రరిస్టులతో సమానమని సంచలన కామెంట్స్ చేశారు.

    వారంరోజులపాటు సైబరాబాద్ పరిధిలో ప్రత్యేకంగా డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేయనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్.. లా అండ్ ఆర్డర్.. ఏఆర్ తోపాటు ఎస్‌వోటీ పోలీసులు కూడా ఈ డ్రైవ్ లో పాల్గొంటారని సీపీ తెలిపారు.

    Also Read: ఎల్‌ఐసీ పాలసీ తీసుకున్నారా.. ఆ తప్పు చేస్తే మోసపోయే ఛాన్స్..?

    మద్యంసేవించి డ్రంకెన్ డ్రైవ్ టెస్టులో దొరికితే మాత్రం ఎవరినీ కూడా విడిచి పెట్టేదిలేదని స్పష్టం చేశారు. తాగి వాహనం నడిపితే ఐపీసీ 304 కింద కేసులు నమోదుచేసి పదేళ్ల జైలు శిక్ష పడేలా చూస్తామని వార్నింగ్ ఇచ్చారు.

    తెలంగాణలో కరోనా నేపథ్యంలో కొన్నిరోజులు డ్రంకెన్ డ్రైవ్ నిలిపివేసిన పోలీసులు ఇటీవల తిరిగి ప్రారంభించారు. ఇక న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు కొనసాగుతాయని సీపీ స్పష్టం చేశారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్