Tollywood multistarrer movies : ప్రస్తుతం సీనియర్ హీరోలు వాళ్ళ హవా ని చూపించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. గత సంవత్సరం విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో 300 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టాడు. ఈ సంవత్సరం చిరంజీవి ‘మన శంకర్ ప్రసాద్’ సినిమాతో 400 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టాడు. బాలయ్య బాబు సైతం వరుసగా నాలుగు విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు… నాగార్జున ఇప్పుడు తన వందో సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు మన సీనియర్ హీరోలందరూ కలిసి మల్టీస్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మన శంకర్ వరప్రసాద్ సినిమాలో చిరంజీవి – వెంకటేష్ కలిసి కనిపించారు. ఇక మన తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
రజినీకాంత్ కమల్ హాసన్ ఇప్పటికే ఒక మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దానికి సంబంధించిన ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. మలయాళం ఇండస్ట్రీలో మమ్ముట్టి, మోహన్ లాల్ ఇద్దరూ ఎలాంటి నటులో మనందరికి తెలిసిందే. ఇక అలాంటి నటులు ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఏకమయ్యారు.
ఇక సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలందరు మల్టీస్టార్ ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక ఈ క్రమం లోనే యంగ్ హీరోలు, స్టార్ హీరోలు సైతం పాన్ ఇండియా సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక సీనియర్ హీరోలు మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఎప్పటినుంచో వాళ్ళందరికి ప్రేక్షకుల నుంచి ఒక మల్టీస్టారర్ సినిమా చేయమని రిక్వెస్టులైతే అందుతున్నాయి.
కానీ ఎవరికి వారు ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయి మల్టీస్టారర్ సినిమా చేస్తే తమ ఇమేజ్ ఎక్కడ పడిపోతుందో అనే ఉద్దేశ్యంతో ఆసక్తి చూపించలేదు. కానీ ఇప్పుడు దాదాపు 70 సంవత్సరాల వయసుకు వచ్చారు. కాబట్టి ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాలు చేసిన పెద్దగా పోయేదేమీ లేదు. కాబట్టి తమ అభిమానుల కోరిక నెరవేర్చుదాం అనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి పూనుకున్నట్టుగా తెలుస్తుంది…