Homeఎంటర్టైన్మెంట్Sumanth Venkatesh family relation: హీరో సుమంత్ కి వెంకటేష్ బాబాయ్ అవుతాడు మరి ఆయనేంటి...

Sumanth Venkatesh family relation: హీరో సుమంత్ కి వెంకటేష్ బాబాయ్ అవుతాడు మరి ఆయనేంటి అలా పిలుస్తాడు..?

Sumanth Venkatesh family relation: తెలుగులో ఫ్యామిలీ సినిమాలకు అడ్రస్ గా మారిన హీరో వెంకటేష్…ఆయన సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి వెంకటేష్ మన ఇంట్లో వ్యక్తి అని ప్రతి ఫ్యామిలీ ఆడియన్ ఫీలయ్యారు. అందువల్లే ఆయన ఏం చేసిన మనం దాన్ని ఓన్ చేసుకొని సినిమాలను చూస్తున్నాం. స్క్రీన్ మీద ఆయన ఇబ్బంది పడుతుంటే మనం ఇబ్బంది పడినట్టుగా ఫీల్ అవుతున్నాం. అంటే ఆయన మన నిత్య జీవితంలో ఒకటిగా మారిపోయారు. కాబట్టి అతన్ని ఇంతకాలం పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరిస్తున్నారు. ఇక గత సంవత్సరం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఆయన చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక ప్రస్తుతం మరోసారి అనిల్ రావిపూడి తో జతకడుతున్నాడు. దాంతోపాటుగా త్రివిక్రమ్ డైరెక్షన్లో చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడోవ తరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్ కి సైతం వెంకటేష్ అంటే చాలా ఇష్టమని ఆయన పలు సందర్భాల్లో తెలియజేశాడు. నిజానికి వెంకటేష్ తనకు వరుసకి బాబాయ్ అవుతాడు. అయిన కూడా సుమంత్ మాత్రం వెంకటేష్ ని ‘బావ’ అని పిలుస్తాడు అంటూ కొంతమంది వాళ్ళకి దగ్గరగా ఉండేవాళ్ళు చెబుతుంటారు.

Also Read: పవన్ కళ్యాణ్ సినిమాల్లో బాలయ్య కి ఆ రెండు సినిమాలంటే చాలా ఇష్టమా..? ఇంతకి ఆ మూవీస్ ఏంటంటే..?

నిజానికి ఆయన అలా ఎందుకు పిలుస్తాడు అనే డౌట్ అందరికి ఉంది. వెంకటేష్ వాళ్ల చెల్లె లక్ష్మీ ని నాగార్జున పెళ్లి చేసుకున్నాడు. నాగార్జున సుమంత్ కి మామయ్య అవుతాడు. కాబట్టి వెంకటేష్ బాబాయ్ అవుతాడు అనేది మనకు తెలుసు…కానీ నాగార్జున వెంకటేష్ వాళ్ల సిస్టర్ ను పెళ్లి చేసుకోవడానికంటే ముందే సుమంత్ వాళ్ల కజిన్ సిస్టర్ ని వెంకటేష్ వాళ్ల అన్నయ్య అయిన సురేష్ బాబు పెళ్లి చేసుకున్నాడు.

సురేష్ బాబు వాళ్ళ వైఫ్ సుమంత్ కి అక్కవుతుంది. అందువల్లే తను వెంకటేష్ ని అలాగే సురేష్ బాబుని ఇద్దరిని మొదటి నుంచి బావ అనే పిలుస్తాడట. సుమంత్ వెంకటేష్ ను బావ అని ఎందుకు పిలుస్తాడు అంటూ కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఒక క్లారిటీ దొరికింది… ఇక ప్రస్తుతం సుమంత్ సైతం గతంలో కొద్దిరోజుల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కూడా ఇప్పుడు వరుస సినిమాలతో ముందుకు దూసుకెళ్తున్నాడు. డిఫరెంట్ పాత్రలను చేయడంలో ఆయన ముందు వరుసలో ఉంటున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version