https://oktelugu.com/

బ్రేక్ వద్దంటూ కాజల్ కి ఫోన్ చేసిన మెగాస్టార్ !

చరణ్ కి కరోనా రావడంతో ఆచార్య సినిమా కూడా కొన్నాళ్ళు ఆగిపోయేలా కనిపిస్తోంది. కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లోని సీన్స్ నే ప్రస్తుతం షూట్ కి ప్లాన్ చేసుకున్నాడు. కానీ, అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మెగాస్టార్ కూడా మరో రెండు వారాలు షూట్ కి రాలేని పరిస్థితి. శరవేగంగా షూట్ చేద్దామకుంటే.. అంతలో చరణ్ కి కరోనా వచ్చింది. చిరు లేకుండా షూట్ జరగదు. ఇప్పటికిప్పుడు మిగిలిన నటీనటుల డేట్స్ కూడా సెట్ […]

Written By:
  • admin
  • , Updated On : December 29, 2020 / 02:25 PM IST
    Follow us on


    చరణ్ కి కరోనా రావడంతో ఆచార్య సినిమా కూడా కొన్నాళ్ళు ఆగిపోయేలా కనిపిస్తోంది. కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లోని సీన్స్ నే ప్రస్తుతం షూట్ కి ప్లాన్ చేసుకున్నాడు. కానీ, అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మెగాస్టార్ కూడా మరో రెండు వారాలు షూట్ కి రాలేని పరిస్థితి. శరవేగంగా షూట్ చేద్దామకుంటే.. అంతలో చరణ్ కి కరోనా వచ్చింది. చిరు లేకుండా షూట్ జరగదు. ఇప్పటికిప్పుడు మిగిలిన నటీనటుల డేట్స్ కూడా సెట్ అవ్వవు. ఈ కారణంగా ఆచార్య షూటింగ్ మళ్లీ పోస్ట్ ఫోన్ అవ్వడం ఖాయం అనుకున్నారు అంతా.

    Also Read: డ్రగ్స్ దందాలో నలిగిపోతున్న హెబ్బా ?

    కానీ మేకర్స్ కి చిరు షూట్ ఆపకండి అని స్పష్టం చేశాడు. రేపటి నుండి షూట్ మొదలపెట్టమని.. ముందుగా తానూ లేని సీన్స్ ను ప్లాన్ చేసుకోమని చెప్పారట. అయితే ప్రకాష్ రాజ్, కాజల్ డేట్స్ ఉంటేనే షూట్ పెట్టుకోగలమని.. వారు ఇప్పటికిప్పుడు డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదని కొరటాల చెప్పుకొచ్చాడట. కానీ ప్రకాష్ రాజ్ రేపటి నుండి డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడట. కానీ కాజల్ ఆల్ రెడీ విశాల్ సినిమా షూట్ లో ఫుల్ బిజీగా ఉంది. కాబట్టి మధ్యలో ఆ సినిమా వదిలేసి రాలేదు. దాంతో మెగాస్టార్ నే పర్సనల్ గా కాజల్ కి ఫోన్ చేసి.. ఆచార్య షూట్ కి బ్రేక్ వద్దు అని.. మీరు ఆచార్య షూట్ లో పాల్గొనాలి అని కోరాడట.

    Also Read: చరణ్ కి కరోనా అయినా.. ‘ఆర్ఆర్ఆర్’ ఆగట్లేదు !

    దాంతో కాజల్ విశాల్ సినిమాకి బ్రేక్ ఇచ్చి.. ఆచార్య కోసం రేపు హైదరాబాద్ రానుంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపిస్తారట. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక సినిమాలో చరణ్ పాత్ర త్యాగం చేసే పాత్రగా ఉంటుందట. అందుకే ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఏది ఏమైనా మెగాస్టార్ – కొరటాల కలయికలో ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటెర్టైనర్ రాబోతుంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్