Homeఆంధ్రప్రదేశ్‌Kethi Reddy Venkatarami Reddy : లోకేష్ ను చూసి నేర్చుకో.. జగన్ కు కేతిరెడ్డి...

Kethi Reddy Venkatarami Reddy : లోకేష్ ను చూసి నేర్చుకో.. జగన్ కు కేతిరెడ్డి సూచన!

Kethi Reddy Venkatarami Reddy : తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి( Kethi Reddy venkatarami Reddy ) . వైసిపి ఎమ్మెల్యేగా ఉంటూ గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ నిర్వంహించిన కార్యక్రమం విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేది. ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అన్నట్టు కామెంట్స్ వినిపించేవి అప్పట్లో. అటువంటి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడం ఒకింత షాకింగ్. ఎన్నికలకు ముందు బిజెపి అభ్యర్థిగా వచ్చిన సత్య కుమార్ యాదవ్ చేతిలో ఆయన ఓడిపోయారు. పైగా సత్యకుమార్ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కేసరికి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి లో ఒక రకమైన ఆలోచన ప్రారంభం అయింది. అయితే తొలుత వైసిపి నాయకత్వం పై వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ పై మాట్లాడారు. ఇప్పుడు మళ్లీ పాత ధోరణితో ధర్మవరం ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కంటే నారా లోకేష్ ఒక విషయంలో మేలు అని కామెంట్స్ చేశారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.

* కొత్త సంప్రదాయం..
నారా లోకేష్ ( Nara Lokesh)కొత్త సంప్రదాయానికి తెర తీస్తున్నారని చెప్పుకొచ్చారు కేతిరెడ్డి. ఆయన నుంచి జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. చాలా తొందరగా నేర్చుకోగల సామర్థ్యం జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పుకొచ్చారు. అయితే అది నిజమే లోకేష్ లో పరిణితి, కొత్త సంప్రదాయం, కొత్త కొత్త పద్ధతులు కనిపిస్తున్నాయి. ముందుగా ఆయన శరీర ఆకృతి మారింది. ఒక హుందాగా, ఫిట్నెస్ గా కనిపిస్తున్నారు. సీనియర్ నేతలతో మమేకమై పనిచేస్తున్నారు. వారి కుటుంబాలతో సన్నిహిత్యం పెంచుకునేందుకు విందు రాజకీయాలకు తెర తీశారు. కేంద్ర పెద్దలతో సఖ్యతగా మెలుగుతున్నారు. క్రీడాకారుల విషయంలో ప్రోత్సాహం అందిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సమకాలీన రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో చేసి చూపిస్తున్నారు నారా లోకేష్. అయితే దానినే గుర్తు చేస్తూ జగన్ లోకేష్ నుంచి నేర్చుకోవాలని కేతిరెడ్డి సూచిస్తున్నట్లు అర్థమవుతోంది. కానీ కేతిరెడ్డి మాత్రం ఆ విషయం బయట పెట్టకుండా ప్రస్తావన తెచ్చి ఈ వ్యాఖ్యలు చేశారు.

* అనుకున్నది చేస్తున్నారు..
రాష్ట్ర ప్రజలకు నారా లోకేష్ ఏం చేస్తున్నారో తెలియదు కానీ.. తాను అనుకున్నది మాత్రం చేస్తున్నారని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చెప్పుకొచ్చారు. నారా లోకేష్ రెడ్ బుక్కు రాజ్యాంగం తెచ్చారన్నది ఆయన అభిప్రాయం. దానిని జగన్మోహన్ రెడ్డి నేర్చుకున్నారని.. రప్పా రప్పా అంటే భయం ఎందుకని ప్రశ్నించారు. అయితే లోకేష్ గొప్పతనం గురించి చెప్పబోయి.. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చుట్టూ తిరిగి మళ్లీ మొదటికి వచ్చారని.. అయితే ఆది నుంచి వెంకట్రామిరెడ్డి జగన్ పై సున్నిత విమర్శలు చేశారు. వైసీపీకి ఓటమి ఎదురైన తర్వాత చిన్న చిన్న విమర్శలు చేశారు. ఒకానొక దశలో ఆయన సైతం వైసీపీని విడిచిపెడతారని ప్రచారం నడిచింది. కానీ ఎలాగో మళ్లీ సెట్ అయ్యారు. అయితే ఇప్పుడు నారా లోకేష్ ను మెచ్చుకున్నట్టు మాట్లాడుతూనే.. వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. తన మనసులో ఉన్నది పూర్తిస్థాయిలో అర్థమయ్యేలా ఆయన బయట పెట్టలేదు. కానీ ఎక్కడో తేడా కొడుతోంది అని మాత్రం సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. లేకుంటే ప్రత్యర్థి నోట లోకేష్ గొప్పతనం మాట రావడం ఏమిటనే ప్రశ్న వస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version