గ్రేటర్లో సమస్యలను పట్టించుకునే నాథుడే లేడా?

తెలంగాణలో సుమారు నాలుగుకోట్ల జనాభా ఉంటే ఒక్క హైదరాబాద్లోనే కోటిపైగా జనం ఉన్నారు. దీంతో ఈ నగరంలో నిత్యం ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటోంది. అయితే వీటిని పరిష్కరించాల్సిన జీహెచ్ఎంసీగానీ ప్రజాప్రతినిధులుగానీ కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Also Read: కేకలు వేసిన పిల్లోడు.. అభినందించిన ఎమ్మెల్యే..! విషయమెంటీ? గతంలో ఎన్నడూ లేనివిధంగా జీహెచ్ఎంసీకి ఈసారి మూడునెలలు ముందుగానే  ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. అయితే ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన […]

Written By: Neelambaram, Updated On : December 18, 2020 8:16 pm
Follow us on

తెలంగాణలో సుమారు నాలుగుకోట్ల జనాభా ఉంటే ఒక్క హైదరాబాద్లోనే కోటిపైగా జనం ఉన్నారు. దీంతో ఈ నగరంలో నిత్యం ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటోంది. అయితే వీటిని పరిష్కరించాల్సిన జీహెచ్ఎంసీగానీ ప్రజాప్రతినిధులుగానీ కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: కేకలు వేసిన పిల్లోడు.. అభినందించిన ఎమ్మెల్యే..! విషయమెంటీ?

గతంలో ఎన్నడూ లేనివిధంగా జీహెచ్ఎంసీకి ఈసారి మూడునెలలు ముందుగానే  ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. అయితే ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాలేదు. 150మంది కార్పొరేటర్లలో 86మందే పాతవారే తిరిగి ఎన్నికవగా.. 64మంది కొత్తవారు ఎన్నికయ్యారు. పాత పాలకవర్గానికి ఫిబ్రవరి 10తేది వరకు గడువు ఉండటంతో కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి.

గ్రేటర్లో ఏ పార్టీకి  స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో మేయర్ పీఠం ఎవరికీ దక్కుతుందో కూడా తెలియడం లేదు. దీంతో కొత్తగా గెలిచిన వాళ్లు ఎప్పుడు పాలన పగ్గాలు చేపడుతారనేది దానిపై కూడా క్లారిటీ రావడం లేదు. ఇక డివిజన్లలోని సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కార్పొరేటర్ల దృష్టికి తీసుకెళితే కొందరేమో నేను ఎన్నికల్లో ఓడిపోయాను.. నేను చేసిది ఏమిలేదని మొఖంపైనే చెబుతాన్నారని టాక్.

Also Read: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలివీ

ఇక గెలిచిన వాళ్లమే తాము ఇంకా ఇన్ ఛార్జి తీసుకోలేదని చెబుతుండటంతో బస్తీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లితే తమ డివిజన్లలో కార్పొరేటర్లు గెలిచారా? లేదా? అని లెక్కలేసుకొని పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా కాదని అధికారుల వద్దకు వెళితే సవాలక్ష ప్రశ్నలతో వేధింపులకు గురిచేస్తున్నారని నగరవాసులు ఆరోపిస్తున్నారు.

ఎన్నికల సమయంలో ఇది చేస్తాం.. అది చేస్తామన్న చెప్పిన నేతలు.. గెలిచాక మాత్రం సమస్యలను గాలికొదిలేశారని విమర్శిస్తున్నారు. కొత్త.. పాత కార్పొరేటర్ల తీరుతో ప్రజలు త్రిశంఖు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నగరవాసుల సమస్యలపై దృష్టిసారించి పరిష్కారం చూపించాలని వేడుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్