ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఫ్లిప్ కార్ట్ సంస్థ మొబైల్ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ఇప్పటికే దసరా, దీపావళి పండుల సమయంలో ఆఫర్లను ప్రకటించిన ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2020 పేరుతో కొత్త సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న స్మార్ట్ ఫోన్లు డిస్కౌంట్ ధరకే లభ్యమవుతున్నాయి.
Also Read: ఆన్ లైన్ అప్పు.. ఆయువును మింగేస్తుందా?
6 జీబీ ర్యామ్, 64 జీబీ మెమొరీ ఉన్న పోకో ఎక్స్ 3 ఫోన్ పై 4000 రూపాయలు, ఆపిల్ ఫోన్ ఎక్స్ ఆర్ మొబైల్ పై 8,900 రూపాయలు, ఐఫోన్ 11 ప్రోపై 26,400 రూపాయలు, ఎల్టీ జీ 8 ఎక్స్ మొబైల్ పై 44,000 రూపాయలు, ఎల్జీ వెల్వెట్ డ్యూయల్ స్క్రీన్ మొబైల్ పై 15,000 రూపాయలు, ఆసస్ రోగ్ ఫోన్ 3 పై 11,000 రూపాయల డిస్కౌంట్ పొందవచ్చు. ఈరోజు నుంచి సేల్ ప్రారంభం కాగా 22 వరకు ఈ సేల్ కొనసాగుతుంది.
Also Read: జియో కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. కొత్త రకం మోసం..?
స్మార్ట్ ఫోన్లతో పాటు ల్యాప్ టాప్ లు, స్పీకర్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీగా ఆఫర్లు అమలవుతున్నాయి. ఎస్బీఐ కార్డుతో కస్టమర్లు షాపింగ్ చేస్తే 1500 రూపాయల వరకు గరిష్టంగా ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఈ సేల్ ద్వారా ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. మరికొన్ని రోజుల్లో 2021 రాబోతూ ఉండటంతో ఫ్లిప్ కార్ట్ సేల్ ను ప్రకటిస్తోంది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
ఫ్లిప్ కార్ట్ స్పీకర్లు, ల్యాప్ టాప్ లపై 1,000 రూపాయల నుంచి 1,500 రూపాయల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. గేమింగ్ ల్యాప్ టాప్ లపై ఫ్లిప్ కార్ట్ ఏకంగా 30,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తోంది. ఎంపిక చేసిన ప్రాడక్ట్ లపై మాత్రమే ఈ ఆఫర్ ను పొందే అవకాశం ఉంటుంది.