https://oktelugu.com/

‘హథ్రాస్’నిందితులపై సీబీఐ చార్జిషీట్ దాఖలు

దేశంలో సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్ లోని హథ్రాస్ ఘటనపై సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న నలుగురు యువకులపై చార్జిషీట్ దాఖలు చేసింది. హథ్రాస్ జిల్లాలో సెప్టెబర్ 14న ఓ యువతిపై నలుగురు యువకులు అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. తన తల్లితో కలిసి పొలం పనులకు వెళ్లిన బాలికపై నలుగురు యువకులు కిరాతకంగా అత్యాచారం చేసి దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ యువతిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 18, 2020 4:26 pm
    Follow us on

    దేశంలో సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్ లోని హథ్రాస్ ఘటనపై సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న నలుగురు యువకులపై చార్జిషీట్ దాఖలు చేసింది. హథ్రాస్ జిల్లాలో సెప్టెబర్ 14న ఓ యువతిపై నలుగురు యువకులు అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. తన తల్లితో కలిసి పొలం పనులకు వెళ్లిన బాలికపై నలుగురు యువకులు కిరాతకంగా అత్యాచారం చేసి దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ యువతిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ సెప్టెంబర్ 29న మరణించింది. అయితే అదే రోజు అర్ధరాత్రి కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా మ్రుతదేహాన్ని పోలీసులు దహనం చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో అన్నివర్గాల నుంచి ఆందోళనలు సాగాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30న ఈ కేసు విచారణకు ప్రత్యేక బ్రుందాన్ని నియమించింది. ఆ తరువాత సీబీఐకి అప్పగించింది. తాజాగా సీబీఐ నిందితులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసింది.