గడిచిన 10 నెలలుగా ప్రపంచ దేశాల ప్రజల మధ్య కరోనా మహమ్మారి గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. వైరస్ గురించి కొత్తగా వెలుగులోకి వస్తున్న విషయాలు ప్రజల్లో భయాందోళనను అంతకంతకూ పెంచుతున్నాయి. తాజాగా చైనా దేశంలో అధికారులు చేపల్లో కరోనా వైరస్ ను గుర్తించారు. చైనా భారత్ కు చెందిన కంపెనీ నుంచి చేపలను దిగుమతి చేసుకోగా వాటి శాంపిల్స్ లో కరోనా వైరస్ కనిపించింది.
దీంతో అధికారులు చేపల దిగుమతులను నిలిపివేశారని సమాచారం. ఆంగ్ల వార్తాసంస్థ రాయిటర్స్ ఈ విషయాలను వెల్లడించింది. కటిల్ ఫిష్ ప్యాకేజీలోని మూడు శాంపిల్స్ లో అధికారులు కరోనా వైరస్ ను గుర్తించారు. చైనా అధికారులు ఇండోనేషియా తో పాటు పలు దేశాల ఆహార ఉత్పత్తుల్లో కరోనా వైరస్ కనిపించడంతో ఆయా దేశాల ఉత్పత్తులపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో చైనా ఆహారపు ఉత్పత్తులను పూర్తిస్థాయిలో తనిఖీ చేసి మాత్రమే దేశంలోకి అనుమతిస్తోంది. దిగుమతి చేసుకున్న అన్ని ఆహారపు ఉత్పత్తులను చైనా పరీక్షించి అనుమతులు ఇస్తోంది. ఈ చేపలు తింటే కరోనా బారిన పడే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలు ఇబ్బందులు పడక తప్పదు.
మరోవైపు కరోనా వ్యాక్సిన్ గురించి శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఫైజర్ సంస్థ వ్యాక్సిన్ తొలి, రెండో, తుది దశ క్లినికల్ ట్రయల్స్ లో సక్సెస్ అయినా కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయని తెలుస్తోంది. కరోనాకు సమర్థవంతమైన వ్యాక్సిన్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో చూడాల్సి ఉంది.