Homeజాతీయ వార్తలుModi Defense Strategy India: ఇండియాకు మోడీ బలం.. ఇరాన్ పై యుద్ధానికి అదే లోపం

Modi Defense Strategy India: ఇండియాకు మోడీ బలం.. ఇరాన్ పై యుద్ధానికి అదే లోపం

Modi Defense Strategy India: ఏ దేశానికి అయినా నయకత్వం బలంగా ఉంటే.. దేశం కూడా సురక్షితంగా ఉంటుంది. బలమైన శత్రువు కూడా భయపడతాడు. ఇరాన్‌పై ప్రస్తుతం అమెరికా యుద్ధం చేస్తోంది. ఇందుకు కారణం అక్కడి నాయకత్వం బలహీనపడడమే ఇరాన్‌ తీవ్రవాదులను తయారు చేస్తుందని, అణుకార్యకలాపాలు నిర్వహిస్తోందని అమెరికా యుద్ధం చేస్తోంది. కానీ పాకిస్తాన్‌తో మాత్రం స్నేహం చేస్తుంది. అంతెందుకు గతంలో ఇరాన్‌తోనూ అమెరికా స్నేహం చేసింది. ఇరాన్‌ కోసం ఇరాక్‌పై యుద్ధం చేసింది. ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్, అమెరికా చెప్పే కారణాలు అణ్వాయుధాలు, మరి పాకిస్తాన వద్ద కూడా అణ్వాయుధాలు ఉన్నాయి. అయినా పట్టించుకోవు.

Also Read: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం… మన బ్రహ్మోస్ గురించి చర్చ.. ఎందుకంటే

భారత్‌లో బలమైన నాయకత్వం..
ఇక మన దేవంలో మొదటి అణు పరీక్ష చేసింది ఇందిరాగాంధీ. అప్పుడు అమెరికా బెదిరింపులకు దిగింది. రష్యా కూడా ఆపేయాలని కోరింది. దీంతో ఆపేసింది. తర్వాత ఆంక్షలు విధించాయి. ప్రపంచ వ్యాప్తంగా సహకారం లేకుండా చేశాయి. అణ్వస్త్ర కార్యకలాపాలు నిలిచిపోయాయి. తర్వాత వాజ్‌పేయి పరీక్షలు చేశారు. ఇప్పుడు మోదీ బలంగా దేశ రక్షణకు పనిచేస్తున్నారు. భారతదేశ అణు చరిత్రలో బలమైన నాయకత్వం కీలక పాత్ర పోషించింది.

1974 స్మైలింగ్‌ బుద్ధ పేరుతో..
ఇందిరా గాంధీ నేతృత్వంలో 1974 మే 18న పోఖ్రాన్‌లో మొదటి అణు పరీక్ష (’స్మైలింగ్‌ బుద్ధ’) జరిగింది. ఇది ’పీస్‌ఫుల్‌ న్యూక్లియర్‌ ఎక్స్‌ప్లోషన్‌’గా పేర్కొనబడింది, కానీ అమెరికా, కెనడా లాంటి దేశాలు టెక్నాలజీ సరఫరా ఆపేశాయి. రష్యా సలహాలు, అంతర్జాతీయ ఒత్తిళ్లతో కార్యక్రమం తాత్కాలికంగా ఆగిపోయింది. 1980ల్లో రాజీవ్‌ గాంధీ, తర్వాతి ప్రభుత్వాల్లో పునరుజ్జీవనం జరగలేదు.

వాజ్‌పేయి ధైర్యసాహసాలు
అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం 1998 మే 11, 13 తేదీల్లో ఐదు పరీక్షలు (ఆపరేషన్‌ శక్తి) రహస్యంగా నిర్వహించింది, డాక్టర్‌ కలాం నేతృత్వంలో పరీక్షలు జరిగాయి. ఇది ఎవరికీ తెలియలేదు. తర్వాత వాజ్‌పేయి ప్రసంగంతో ప్రపంచానికి తెలిసింది. అమెరికా, జపాన్, ఐరోపా ఆర్థిక ఆంక్షలు విధించాయి. అయినా, 1999 జనవరి 4న ’నో ఫస్ట్‌ యూజ్‌’, ’క్రెడిబుల్‌ మినిమమ్‌ డిటరెన్స్‌’ విధానాన్ని ప్రకటించారు. మొదట ఎవరినీ దాడి చేయకుండా, ప్రతీకారంగా మాత్రమే ఉపయోగిస్తామని ప్రకటించారు. ఇది పాకిస్తాన్, చైనా అణు బెదిరింపులకు సమాధానంగా మారింది.

తర్వాత కాంగ్రెస్‌ పట్టించుకోలేదు..
కాంగ్రెస్‌ పాలనలో (మన్మోహన్‌ సింగ్‌ యుపీఏ) 1998 తర్వాత కొత్త పరీక్షలు జరగలేదు. 2008లో అమెరికాతో అణు ఒప్పందం చేసుకుని సివిల్‌ న్యూక్లియర్‌ వాణిజ్యం ప్రారంభించారు. ఇది సైనిక కార్యక్రమాన్ని పరోక్షంగా పరిమితం చేసినట్టు విమర్శలు వచ్చాయి. మోదీ పాలనలో అగ్ని–వీ మిర్వ్‌ పరీక్షలు, 10 కొత్త రియాక్టర్లు, ప్రైవేట్‌ రంగ పాల్గొన్ని సామర్థ్యం పెరిగింది.ఫలితంగా, భారత్‌ అణు ఆయుధాల సంఖ్య 172–180కి చేరింది, ప్రపంచంలో 6వ స్థానం.

అమెరికా ద్వంద్వ విధానం..
ఇరాన్‌ అణు కార్యక్రమంమీరుతూ తీవ్రవాదానికి మద్దతు ఇస్తోందని అందుకే ఇరాన్‌పై యుద్ధం చేస్తున్నామని అమెరికా, ఇజ్రాయెల్‌ ప్రకటించాయి. 1980ల ఇరాన్‌–ఇరాక్‌ యుద్ధంలో అమెరికా ఇరాక్‌కు మద్దతు ఇచ్చింది, ఇరాన్‌తో శత్రుత్వం పెరిగింది. పాకిస్తాన్‌ అణు ఆయుధాలు (170 సుమారు) ఉన్నప్పటికీ, భద్రతా సహకారం, ఆంక్షలు తగ్గించి అమెరికా స్నేహం కొనసాగుతోంది.

మోదీ ఇజ్రాయెల్‌ సందర్శనలో ధైర్యం చూపారు, ఇరాన్‌–పాక్‌ అంతర్గత సమస్యలతో నాయకత్వం బలహీనపడుతుంది. భారత్‌ ఓపికతో పరిష్కరించుకుంటుంది. 2030 నాటికి 200 అణ్వాయుధాలు తయారీ లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version