https://oktelugu.com/

ఈ పోస్టాఫీస్ స్కీమ్ తో కోటీశ్వరులు కావచ్చు..!

ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించి మంచిగా జీవించాలని భావిస్తారు. అందుకోసం నిరంతరం కష్టపడుతుంటారు. అయితే ఇలా డబ్బులు సంపాదించడం ప్రతి ఒక్కరికి సాధ్యం కాని పని. మన జీవితంలో కోటీశ్వరులుగా ఎదగాలంటే మన డబ్బును ఆదా చేయడం ద్వారా వచ్చే రాబడి తో ఎంతో సంపాదించవచ్చు. డబ్బును ఆదా చేస్తే రాబడి ఎలా వస్తుంది అన్న అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అలాంటి వారి కోసమే ఈ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటుచేసిన కొన్ని ప్రత్యేకమైన స్కీమ్ ల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 13, 2020 / 06:04 PM IST
    Follow us on

    ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించి మంచిగా జీవించాలని భావిస్తారు. అందుకోసం నిరంతరం కష్టపడుతుంటారు. అయితే ఇలా డబ్బులు సంపాదించడం ప్రతి ఒక్కరికి సాధ్యం కాని పని. మన జీవితంలో కోటీశ్వరులుగా ఎదగాలంటే మన డబ్బును ఆదా చేయడం ద్వారా వచ్చే రాబడి తో ఎంతో సంపాదించవచ్చు. డబ్బును ఆదా చేస్తే రాబడి ఎలా వస్తుంది అన్న అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అలాంటి వారి కోసమే ఈ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటుచేసిన కొన్ని ప్రత్యేకమైన స్కీమ్ ల గురించి తెలుసుకోవాల్సిందే.

    పోస్ట్ ఆఫీస్ 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల కాలపరిమితిలో సేవింగ్ స్కీమ్స్ అందిస్తోంది.పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ,ఆర్‌డీ, కిసాన్ వికాస్ పత్ర వంటి వివిధ రకాల స్కీమ్ లను మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.PPF పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో డబ్బులు ప్రతి నెల12,500 చొప్పున ఈ స్కీమ్ కింద జమ చేయవచ్చు. ఇందుకు గాను వడ్డీ రేటు 7.1 శాతం వర్తిస్తుంది. ఇలా 25 ఏళ్ళు ఈ స్కీం కి ఇన్వెస్ట్ చేస్తే దాదాపుగా రూ.103 కోట్ల రూపాయలు మీ చేతికి అందుతుంది.

    రికరింగ్ డిపాజిట్ RD ఇందులో కూడా డబ్బులను ఇన్వెస్ట్ చేయవచ్చు. పిపిఎఫ్ మాదిరిగానే ఆర్ డి లో కూడా నెలకు రూ.12,500 ఇన్వెస్ట్ చేయడం ద్వారా వడ్డీ రేటు5.8 శాతం 27 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే దాదాపుగా 99 లక్షల రూపాయలను మీరు పొందవచ్చు. ఇక నేషనల్ సర్వింగ్ సర్టిఫికెట్ లో కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందులో ఎంతైనా డబ్బులను ఇన్వెస్ట్ చేయవచ్చు.

    నేషనల్ సర్వీసింగ్ సర్టిఫికెట్ స్కీమ్ కింద రూ.15 లక్షల రూపాయలను ఇన్వెస్ట్ చేశారనుకుంటే ఇందుకు వడ్డీ రేటు 6.8శాతం ప్రకారం ఐదు సంవత్సరాల తర్వాత మీకు 20.85 లక్షల రూపాయలు వస్తాయి. అదే విధంగా 30 సంవత్సరాల తర్వాత తీసుకుంటే రూ.1.07 కోట్ల రూపాయలను పొందవచ్చు. ఇలా ప్రతి ఒక్క స్కీమ్లో మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా మన ఆదాయం నుంచి రాబడిని పొందవచ్చు. అయితే పోస్ట్ ఆఫీస్ లో జమ చేసే డబ్బులకు 100% గ్యారెంటీ ఉంటుంది.మరెందుకు ఆలస్యం ఈ స్కీము లలో డబ్బులను ఇన్వెస్ట్ చేసి కోటీశ్వరులు గా మారిపోవచ్చు.