విపత్తు సాయం: తెలంగాణకు హ్యాండిచ్చిన మోడీ

నో డౌట్. తెలంగాణపై మోడీ, అమిత్ షాలు నజర్ పెట్టారు. మొన్నటి హైదరాబాద్ వరదలు చరిత్రలోనే కనీవినీ ఎరుగని నష్టాన్న మిగిల్చాయి. జాతీయ స్థాయి మీడియా కూడా దీన్ని ఎలుగెత్తి చాటింది. 100 ఏళ్లలో హైదరాబాద్ లో రాని వరదలు ఇప్పుడు వచ్చాయి. అయినా కూడా మోడీ సర్కార్ నాడు మొసలి కన్నీరు కాల్చి ఇప్పుడు పైసా విదిల్చని వైనంపై విమర్శలు చెలరేగుతున్నాయి. Also Read: గెలుపు కోసం పార్టీల పోలిక, చీలిక వ్యూహం! తాజాగా ఆరు […]

Written By: NARESH, Updated On : November 13, 2020 7:23 pm

kcr modi

Follow us on

kcr fight with modi

నో డౌట్. తెలంగాణపై మోడీ, అమిత్ షాలు నజర్ పెట్టారు. మొన్నటి హైదరాబాద్ వరదలు చరిత్రలోనే కనీవినీ ఎరుగని నష్టాన్న మిగిల్చాయి. జాతీయ స్థాయి మీడియా కూడా దీన్ని ఎలుగెత్తి చాటింది. 100 ఏళ్లలో హైదరాబాద్ లో రాని వరదలు ఇప్పుడు వచ్చాయి. అయినా కూడా మోడీ సర్కార్ నాడు మొసలి కన్నీరు కాల్చి ఇప్పుడు పైసా విదిల్చని వైనంపై విమర్శలు చెలరేగుతున్నాయి.

Also Read: గెలుపు కోసం పార్టీల పోలిక, చీలిక వ్యూహం!

తాజాగా ఆరు రాష్ట్రాలకు కేంద్రం విపత్తు సహాయం మంజూరు చేసింది. ప్రకృతి విపత్తు సహాయార్ధం హైలెవెల్ కమిటీ నిర్ణయం మేరకు ఈ సహాయాన్ని మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఈ ఆరు రాష్ట్రాల్లో అధికమొత్తంలో పశ్చిమ బెంగాల్ కు కేంద్ర సాయం అందిందని చెప్పాలి.

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వరద బీభత్సానికి మాత్రం ఎటువంటి నిధులు మంజూరు చేయకపోవడం విశేషం.. మొన్ననే ఏపీలో కేంద్ర బృందం పరిశీలనకు వచ్చి వెళ్ళింది. ఆ బృందం ఇచ్చే నివేదికను బట్టి ఏపీకి నిధులు మంజూరు చేసే అవకాశం ఉంది. తెలంగాణాకు కూడా అప్పుడే నిధులు మంజూరు చేసే అవకాశం కనిపిస్తోంది.

Also Read: టీఆర్ఎస్‌ భారీ స్కెచ్‌.. బీజేపీ బయటపడేదెలా..!

కేంద్రంలోని మోడీ సర్కార్ విపత్తు సాయంలో మరోసారి తెలంగాణకు మొండి చేయచి చూపించింది. అంత మాత్రంగా వరదలు వచ్చిన కర్ణాటక రాష్ట్రానికి 577.84 కోట్లు కేటాయించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. వరదలతో నిండా మునిగిన హైదరాబాద్ కు, తెలంగాణకు నయా పైసా విదిల్చికపోవడం విమర్శలకు తావిచ్చింది.

బెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు నిధుల మంజూరు అయ్యాయి. మొత్తం రూ. 4,381.88 కోట్లు ముంజూరు చేసింది చేసిన కేంద్ర హోంశాఖ. 2020లో “ఉంపున్”, “నిసర్గ” తుఫాన్లు, వరదలు, కొండచరియలు విరిగిపడి నష్టపోయిన రాష్ట్రాలకు కేంద్రం ఈ సాయం ప్రకటించింది. ఉంపున్ తుఫాన్ సహాయం కింద అత్యధికంగా బెంగాల్ రాష్ట్రానికి రూ. 2,707.77 కోట్ల సాయం చేసింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్