కరోనా.. కరోనా.. కరోనా.. ఈ పేరు చెబితేనే ప్రపంచం బెంబేలెత్తిపోతుంది. కరోనా ధాటికి అగ్రరాజ్యాలు సైతం కకావికలం అవుతున్నాయి. తొలుత చైనాలో వెలుగు చూసిన కరోనా వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలు పాకింది.
Also Read: నల్లపిల్లి ఇంట్లో ఉంటే కోట్ల రూపాయలు.. నిజమేనా..?
ప్రస్తుతం ప్రపంచంలోని అన్నిదేశాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక భారత్ లోకి కరోనా 2020 తొలినాళ్లలోనే ఎంట్రీ ఇచ్చింది. దీంతో కేంద్రం లాక్డౌన్ విధించి కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై ప్రజలు అవగాహన కల్పించాయి.
ఈక్రమంలోనే దేశంలో కరోనా కేసుల సంఖ్య తాజాగా కోటి మార్క్ ను దాటేశాయి. జనవరిలో దేశంలో కరోనా తొలి కేసు నమోదుకాగా ఏడాదిలోపే కోటి కేసుల సంఖ్యను దాటేయడం ఆందోళనను రేపుతోంది.
Also Read: రైతు చట్టాలను చదవండి.. దేశ ప్రజలకు లేఖ షేర్ చేసిన మోడీ
గత 24గంటల్లో దేశంలో 25,153 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1,00,04,599కు చేరింది. గడిచిన 24గంటల్లో కరోనాతో 347మంది మృతిచెందారు.
దీంతో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య ఇప్పటివరకు 1,45,136కు పెరిగింది. అయితే దేశవ్యాప్తంగా 95,50,712 మంది కరోనా జయించగా ప్రస్తుతం దేశంలో 3,08,751 యాక్టివ్ కేసులున్నాయి.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్