కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ దేశ రాజధాని రైతుల ఆందోళనతో హోరెత్తుతోంది. ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్, హర్యానా , యూపీ రైతులు చేస్తున్న నిరసనలు నేటితో 24 రోజులు పూర్తయ్యియి. రహదారులనే ఆవాసాలుగా మార్చి రైతులు చేస్తున్న ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తుతోంది.
Also Read: చంద్రబాబు, జగన్.. ఓ అధికారి బలి!
రైతులతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పలు మార్లు చర్చలు జరిపినా వారు వెనక్కి తగ్గడం లేదు. దీంతో ప్లాన్ బిని కేంద్రం అమలు చేస్తోంది. కొత్త చట్టాలు పూర్తిగా రద్దు చేస్తేనే తాము విరమిస్తామని రైతులు అంటుండగా.. రైతులకే ఆ చట్టాలు మేలు చేస్తాయని తాజాగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రైతులకు ఓ లేఖ రాశారు. అన్ని భాషల్లో విడుదలైన లేఖను మోడీ తన ట్విట్టర్ షేర్ చేసి ఇది దేశ ప్రజలంతా చదవాలని.. అందరికీ షేర్ చేయాలని కోరారు. రైతులకు మేలు చేసే తమ చట్టాలను అపార్థం చేసుకోకుండా సహకరించాలని మోడీ ఈ సందర్భంగా దేశ ప్రజలను కోరారు.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వ్యవసాయ చట్టాలపై రాసిన లేఖ నమో యాప్ లో కూడా ఉందని.. దీన్ని అందరూ షేర్ చేయాలని ట్విట్టర్ వేదికగా ప్రజలను కోరారు. బీజేపీ శ్రేణులు మద్దతు దారులు ఇప్పుడు ఈ లేఖను పెద్ద ఎత్తున షేర్ చేస్తూ హోరెత్తిస్తున్నారు. రైతులకు మేలు చేసే కొత్త వ్యవసాయ చట్టాలని ఎలుగెత్తి చాటుతున్నారు.
Also Read: గన్నవరం వైసీపీలో భగ్గుమన్న విభేదాలు
మోడీ సర్కార్ రైతుల ఆందోళనకు విరుగుడు ఆలోచించింది. ఆ చట్టాలు మంచివని చాటడానికి రెడీ అయ్యింది. దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం వ్యాపించకుండా మోడీ సర్కార్ నష్టనివారణ చర్యలు చేపట్టింది. తాజాగా నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రం విడుదల చేసిన బులిటెన్ ను అందరూ చదవాలని ప్రధాని మోడీ దేశ ప్రజలను కోరారు. కేంద్రం రూపొందించిన ఈ-బుక్ లెట్ లో వ్యవసాయ చట్టాల గురించి విస్తృత సమాచారం ఉందని.. ఆ చట్టాలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతాయో గ్రాఫిక్స్ రూపంలో తీర్చిదిద్దినట్టు పేర్కొన్నారు.కొత్త చట్టాల అమలు అనంతరం ఒప్పంద వ్యవసాయం వల్ల లాభపడ్డ రైతుల విజయాలను వివరించారు.
వ్యవసాయ శాఖ మంత్రి @nstomar గారు రైతు సోదర సోదరీమణులకు ఓ లేఖ ద్వారా తన భావాలను తెలియజేశారు. మర్యాదపూర్వకమైన చర్చ కోసం ప్రయత్నం చేశారు. ఈ లేఖ ను అన్న దాతలందరూ చదవాలని నా విన్నపం. సాధ్యమైనంత ఎక్కువ మందికి ఈ లేఖ అందేలా చేయాలని
దేశ ప్రజలకు విజ్ఞప్తి. https://t.co/Nkcimj9LYl— Narendra Modi (@narendramodi) December 19, 2020
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1681849
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్