https://oktelugu.com/

కేసీఆర్ ఫౌంహౌస్ పై ‘బండి’ సంచలన కామెంట్స్..!

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ మారుతోంది. ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ దూకుడుకు బీజేపీ బ్రేక్ వేసింది. దీంతో బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు షూరు అయ్యాయి. Also Read: రైతు చట్టాలను చదవండి.. దేశ ప్రజలకు లేఖ షేర్ చేసిన మోడీ అయితే ఇటీవల సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ.. కేంద్ర మంత్రులతో భేటి అయి వచ్చారు. దీంతో టీఆర్ఎస్-బీజేపీ మధ్య రాజీ కుదిరిందనే ప్రచారం జరిగింది. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 19, 2020 8:17 pm
    Follow us on

    Bandi Sanjay and KCRతెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ మారుతోంది. ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ దూకుడుకు బీజేపీ బ్రేక్ వేసింది. దీంతో బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు షూరు అయ్యాయి.

    Also Read: రైతు చట్టాలను చదవండి.. దేశ ప్రజలకు లేఖ షేర్ చేసిన మోడీ

    అయితే ఇటీవల సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ.. కేంద్ర మంత్రులతో భేటి అయి వచ్చారు. దీంతో టీఆర్ఎస్-బీజేపీ మధ్య రాజీ కుదిరిందనే ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని టీఆర్ఎస్ పై బండి చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనంగా కన్పిస్తున్నాయి.

    తాజాగా బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించి సీఎం కేసీఆర్ పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ ఫాంహౌస్ దాటి రావడం లేదని.. ఆయన ఫాంహౌస్ సీఎంగా సెటిలయ్యారంటూ విమర్శలు గుప్పించారు.

    రాష్ట్రంలోని దేవాలయాల భూములను టీఆర్ఎస్..ఎంఐఎంలు కబ్జా చేస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ ఫాంహౌస్ ను డీజేపీ తనిఖీ చేస్తే ఏదో ఒకటి బయట పడుతుందంటూ సంచలన కామెంట్స్ చేశారు.

    Also Read: చంద్రబాబు, జగన్.. ఓ అధికారి బలి!

    రాష్ట్రంలో శాంతి భద్రత సమస్యల ఉందని ఆదిలాబాద్ ఘటన ద్వారా వెల్లడిందన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్న కేసీఆర్ ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. ఒక్కో నిరుద్యోగికి ప్రభుత్వం 72వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

    తెలంగాణ రాష్ట్రం సంఘ విద్రోహులకు అడ్డగా మారిందని.. పోలీసులు స్వేచ్ఛగా విధులు నిర్వహించలేక పోతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ వాళ్లను నిలదీసే సత్తా ఒక్క బీజేపీకే ఉందని బండి సంజయ్ స్పష్టం చేశారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్