తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త సచివాలయ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పాత సచివాలయం స్థానంలో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తలంచారు. ఇందుకోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకెళ్లారు.
Also Read: టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం అవసరమా? అంటూ ప్రతిపక్షాలు.. ప్రజాసంఘాలు ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసినా కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదు. కొత్త సచివాలయ నిర్మాణానికే కేసీఆర్ మొగ్గుచూపారు.
దీంతో ప్రతిపక్షాలు.. ప్రజాసంఘాలు కొత్త సచివాలయ నిర్మాణానికి అడుగడుగునా అడ్డం పడ్డాయి. కోర్టులో సచివాలయ నిర్మాణానికి అడ్డుకోవాలని చూశాయి. వాటన్నింటిని సీఎం కేసీఆర్ చాకచాక్యంతో అధిగమించి నిర్మాణ అనుమతులు సాధించారు.
తెలంగాణ సచివాలయానికి హైకోర్టు నుంచి లైన్ క్లియర్ అయిన తర్వాత ఈ అంశం కేంద్రం పరిధిలోకి వెళ్లింది. కొత్త సచివాలయం నిర్మాణానికి కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు కావాల్సి ఉండటంతో కేసీఆర్ సర్కార్ ఆమేరకు ప్రతిపాదనలు పంపించింది.
ఇక తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా రాజకీయాలు నడుస్తున్నారు. తెలంగాణ సచివాలయ నిర్మాణానికి బీజేపీ తొలి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ తరుణంలో కేంద్రం కొత్త సచివాలయానికి అనుమతి ఇస్తుందా? లేదా ఆసక్తి నెలకొంది.
Also Read: కోతి వల్ల ప్రాణాలు కోల్పోయిన్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. ఏం జరిగిందంటే..?
అయితే ఎట్టకేలకు కేంద్ర పర్యావరణ శాఖ నుంచి కొత్త సచివాలయ నిర్మాణానికి అనుమతులు రావడంతో మార్గం సుగమం అయింది. దీంతో కొత్త ఏడాదితో కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ రాష్ట్ర కీర్తిప్రతిష్టలు ఇమిడించేలా నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే కొత్త సెక్రటేరియట్ కు సంబంధించిన పలు డిజైన్లను కేసీఆర్ సమీక్షించారు. వీటిలో కొన్ని మార్పులను సీఎం సూచించారు. కొత్త సెకట్రేరియట్ డిజైన్ రాష్ట్ర క్యాబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపిన సంగతి అందరికీ తెల్సిందే..!
2020 సంవత్సరంలో తెలంగాణలో టీఆర్ఎస్ కు రాజకీయంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. 2021 సంవత్సరంలో టీఆర్ఎస్ తన పాత జోరును కొనసాగిస్తుందా? లేదా అనేది మాత్రం వేచిచూడాల్సిందే..!
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్