https://oktelugu.com/

పట్టపగలే దళిత యువకుడు దారుణ హత్య

పట్టపగలే ఓ దళిత యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కర్నూల్ జిల్లాలోని ఆదోనిలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నందవరం మండలం గురజాలకు చెందిన ఆడమ్‌స్మిత్‌(35) ఆదోనిలో ఫిజియోథెరపిస్టుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గురజాల గ్రామానికి చెందిన మహేశ్వరిని గత కొంతకాలం నుంచి ఆడమ్‌స్మిత్ ప్రేమిస్తున్నాడు. అయితే ఈ విషయం తెలియక మహేశ్వరికి 2020, నవంబర్‌లో మరో అబ్బాయితో నిశ్చితార్థం జరిపించారు. మహేశ్వరి మనసులో ఆడమ్‌స్మిత్ ఉండటంతో బ్యాంకు కోచింగ్‌కు […]

Written By: , Updated On : January 1, 2021 / 10:20 AM IST
Follow us on

పట్టపగలే ఓ దళిత యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కర్నూల్ జిల్లాలోని ఆదోనిలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నందవరం మండలం గురజాలకు చెందిన ఆడమ్‌స్మిత్‌(35) ఆదోనిలో ఫిజియోథెరపిస్టుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గురజాల గ్రామానికి చెందిన మహేశ్వరిని గత కొంతకాలం నుంచి ఆడమ్‌స్మిత్ ప్రేమిస్తున్నాడు. అయితే ఈ విషయం తెలియక మహేశ్వరికి 2020, నవంబర్‌లో మరో అబ్బాయితో నిశ్చితార్థం జరిపించారు. మహేశ్వరి మనసులో ఆడమ్‌స్మిత్ ఉండటంతో బ్యాంకు కోచింగ్‌కు నంద్యాల వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆడమ్‌స్మిత్‌, మహేశ్వరి కలిసి హైదరాబాద్‌కు వచ్చి నవంబర్ 12న ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. మహేశ్వరి పెళ్లి చేసుకున్నట్లు ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో.. ఆడమ్‌స్మిత్‌ను చంపేస్తామంటూ ఫోన్‌లో బెదిరించారు.