https://oktelugu.com/

త్వరలోనే బీజేపీలో చేరుతున్నా..: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. తాను పార్టీని సైతం మారబోతున్నట్లు చెప్పకొచ్చారు. శుక్రవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులో తాను బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని 2019 జులైలోనే తాను చెప్పానన్నారు. రాబోయే రోజుల్లోనూ బీజేపీ ఎదుగుతుందనే భావనను ఆయన వ్యక్తం చేశారు. Also Read: అదిరిందయ్యా ‘చంద్రం’.. కొత్త ఏడాదిలో […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 1, 2021 / 10:31 AM IST
    Follow us on


    నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. తాను పార్టీని సైతం మారబోతున్నట్లు చెప్పకొచ్చారు. శుక్రవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులో తాను బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని 2019 జులైలోనే తాను చెప్పానన్నారు. రాబోయే రోజుల్లోనూ బీజేపీ ఎదుగుతుందనే భావనను ఆయన వ్యక్తం చేశారు.

    Also Read: అదిరిందయ్యా ‘చంద్రం’.. కొత్త ఏడాదిలో కొత్త సెకట్రేరియట్..!

    కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నప్పటికీ.. బీజేపీ గురించి తన అభిప్రాయాలను నిస్సంకోచంగా వెల్లడించానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు లేవన్నారు. ‘అన్నాదమ్ముళ్లలా కలిసే ఉంటాం.. కానీ నా సొంత అభిప్రాయం మేరకు పార్టీ మారుతున్నానంటూ’ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పీసీసీ చీఫ్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర భవిష్యత్‌ ప్రజల చేతుల్లో ఉందన్నారు. తెలంగాణ ప్రజానీకం శ్రేయస్సు దృష్ట్యా కొన్ని నిర్ణయాలను సీఎం కేసీఆర్ పునఃసమీక్షించుకోవాలని ఆయన సూచించారు. ప్రజాస్వామ్యంలో ఒంటెద్దు పోకడలకు పోకుండా అన్ని పార్టీలను కలుపుకొని వెళ్లాలన్నారు. తన అభిమాన నాయకుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టే ప్రతీ పని విజయవంతం కావాలని శ్రీవారిని కోరుకున్నానని రాజగోపాల్ రెడ్డి మీడియాకు తెలిపారు.

    Also Read: టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

    టీపీసీసీ పదవి విషయం ఓ కొలిక్కి రాకముందే కాంగ్రెస్ కు మరో పెద్ద షాక్ తగిలింది. ఇప్పటికే పీసీసీ చీఫ్‌ కోసం ఎవరికి వారుగా ప్రయత్నాలు సాగిస్తుండగా.. ఇలా ఇన్నాళ్లు పార్టీని నమ్ముకున్న వారు ఒక్కొక్కరుగా వీడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీపై నమ్మకం లేక.. సీనియర్ల వైఖరి నచ్చకనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పకనే చెబుతున్నారు. మరి రాబోయే కొత్త చీఫ్‌ ఎవరో కానీ.. ఇలాంటి పార్టీ అసంతృప్తులను ఎలా బుజ్జగిస్తారు.. ఎలా పార్టీని కాపాడుతారనేది పెద్ద టాస్క్‌లా మారింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్