ఎడారి రాష్ట్రంలో రాజకీయాలు మరోసారి కీలక మలుపు తిరగబోతున్నాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. కొద్దినెలల క్రితం రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. సీఎం అశోక్ గెహ్లట్.. డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ల మధ్య నెలకొన్న వివాదాలు చివరకు ప్రభుత్వం కూలేంత వరకు వచ్చింది.
Also Read: కోదండరాం ఎందుకు సైలంట్ అయ్యారు.. బరిలో నిలిచేనా?
ఈక్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగి నాటకీయ పరిణామాల మధ్య సచిన్ పైలట్ ను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి తీసుకొచ్చింది. దీంతో ఆ వివాదం సర్దుమణిగి మళ్లీ పాలన గాడిలో పడింది. అయితే గెహ్లాట్ సర్కార్ కు మద్దతు ఇస్తున్న భారతీయ గిరిజన పార్టీ(బీటీపీ) తన మద్దతు ఉపసంహరించుకున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ పరిణామం రాజస్థాన్లో మరోసారి హాట్ టాపిక్ మారింది.
ఇటీవల రాజస్థాన్లో 4,371 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 1,695 స్థానాల్లో విజయం సాధించగా ప్రతిపక్షంలోని బీజేపీ 1,695 స్థానాల్లో గెలుపొందింది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీటీపీకి మద్దతు తెలుపకపోవడంతో తమ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలైనట్లు ఆపార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే బీటీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: బీజేపీలోకి మాజీ మంత్రి.. చేరికలకు రంగం సిద్ధం?
ఈ ఏడాది ప్రారంభంలో కాంగ్రెస్ రాజకీయ సంక్షోభం నెలకొనగా ప్రభుత్వం బలనిరూపణకు సిద్ధమైంది. ఈ తరుణంలోనే భారతీయ గిరిజన పార్టీ(బీటీపీ) గెహ్లాట్ సర్కార్ మద్దతు తెలిపింది. తాజాగా ఈ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇన్నిరోజులుగా కాంగ్రెస్ ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో మరోసారి రాజస్థాన్లో రాజకీయ సంక్షోభం రానుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Congress government fall in rajasthan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com