spot_img
Homeఅత్యంత ప్రజాదరణఢిల్లీ నుంచి రేవంత్ కు పిలుపు.. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపేందుకేనా?

ఢిల్లీ నుంచి రేవంత్ కు పిలుపు.. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపేందుకేనా?

Sonia Revanth

జీహెచ్ఎంసీ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చెందాడంతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశాడు. గ్రేటర్లో టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ.. ఎంఐఎం పార్టీలు సీట్లు సాధించడంతో జీహెచ్ఎంసీలో హంగ్ ఏర్పడింది. ఇక కాంగ్రెస్ మాత్రం కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలుచుకొని గల్లీ స్థాయికి పడిపోయింది.

Also Read: జీహెచ్ఎంసీ ఎఫెక్ట్: కేటీఆర్ సీఎం, కేసీఆర్ పీఎం కల చెదిరినట్టేనా?

తెలంగాణ ఇచ్చామని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇంత దారుణంగా ఓటమి పాలవడాన్ని కార్యకర్తలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ చేజేతుల తెలంగాణలో తన స్థాయిని కోల్పోతూ వస్తోంది. హూజుర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత టీపీసీసీ మార్పు ఉంటుందని అప్పుడే ప్రచారం జరిగింది.

కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వాలని భావించగా ఆ పార్టీలోని సీనియర్లు వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదన అమలు కాలేదు. తాజాగా దుబ్బాక ఎన్నికల ఫలితం తర్వాత టీపీసీసీ మార్పు ఉంటుందని అనుకున్నప్పటికీ జరుగలేదు. తాజాగా జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలవడంతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు.

Also Read: బ్రేకింగ్: గ్రేటర్ వార్ లో కాంగ్రెస్ ఘోర పరాజయం.. ఉత్తమ్ రాజీనామా

డిసెంబర్ 9న కాంగ్రెస్ అధినేత్రి సోనియా పుట్టిన రోజు సందర్భంగా రేవంత్ రెడ్డికి టీపీసీసీని కట్టబెడుతారనే ప్రచారం గత కొద్దిరోజులుగా జరుగుతోంది. ఈక్రమంలోనే రేవంత్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి అయితేనే అటూ టీఆర్ఎస్.. ఇటూ బీజేపీని ధీటుగా ఎదుర్కొంటాడని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.

కాంగ్రెస్ ను వీడిన సీనియర్లను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చే సత్తా రేవంత్ కే ఉందని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో రేవంత్ రెడ్డికే టీపీసీసీ పదవీ కట్టబెట్టాలని అధిష్టానం నిర్ణయించుకుందని సమాచారం. రేవంత్ కే పీసీసీ దక్కుతుందన్న ప్రచారం కాంగ్రెస్ లో జోరుగా సాగుతుండటంతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. కాగా రేవంత్ కే టీపీసీసీ దక్కుతుందా? లేక మరేవరికైనా టీపీసీసీ ఇస్తారనేది రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version