సాగర్లో బీజేపీ వ్యూహం అదేనా?

దుబ్బాక ఉప ఎన్నిక.. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత అందరిచూపు నాగార్జున్ సాగర్ ఉప ఎన్నికపైనే పడింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నొముల నర్సయ్య అకాల మృతితో నాగార్జున్ సాగర్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు గెలుపు వ్యూహాలు రచిస్తున్నాయి. Also Read: ఆన్ లైన్ లోన్ యాప్ ల ఆటకట్టించిన పోలీసులు ఇటీవల వరుసగా జరిగిన రెండు ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి షాకిచ్చింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ […]

Written By: Neelambaram, Updated On : December 23, 2020 8:33 pm
Follow us on

దుబ్బాక ఉప ఎన్నిక.. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత అందరిచూపు నాగార్జున్ సాగర్ ఉప ఎన్నికపైనే పడింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నొముల నర్సయ్య అకాల మృతితో నాగార్జున్ సాగర్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు గెలుపు వ్యూహాలు రచిస్తున్నాయి.

Also Read: ఆన్ లైన్ లోన్ యాప్ ల ఆటకట్టించిన పోలీసులు

ఇటీవల వరుసగా జరిగిన రెండు ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి షాకిచ్చింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించి కాషాయం జెండా రెపరెపలాడింది. అదేవిధంగా జీహెచ్ఎంసీలోనూ టీఆర్ఎస్ కు మేయర్ పీఠం దక్కకుండా చేయగలిగింది. దీంతో తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అనే మాట విన్పిస్తోంది.

నాగార్జున్ ఉప ఎన్నిక ఫలితం రాబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రభావం చూపనుండటంతో అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్.. టీఆర్ఎస్ లతో పోలిస్తే బీజేపీ బలం తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ ఇతర పార్టీల నేతలకు గాలంవేస్తోంది.

Also Read: యూకే నుంచి తెలంగాణకు వచ్చిన వారి లెక్క తేలిందా?

దీనికితోడు బలమైన బీసీ అభ్యర్థిని బరిలో దింపేందకు ప్రయత్నాలు చేస్తోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కొత్త ఓటర్లను కలుపుకుంటే 2.2 లక్షల వరకు ఉంటారని అంచనా. గతంలో చేపట్టిన సర్వే ప్రకారం నియోజకవర్గంలో బీసీ ఓటర్లు 1.3లక్షల మంది ఉండగా యాదవ సామాజిక వర్గం నుంచి 50వేల వరకు ఉన్నారని సమాచారం.

ఎస్టీలు 35వేలు.. ఎస్సీలు 20 వేల ఓట్లు.. రెడ్డి సామాజిక వర్గం 15వేలు.. కమ్మ వర్గం నుంచి 6నుంచి 7వేలు ఉంటారని సమాచారం. ఈక్రమంలోనే బీజేపీ యాదవ సామాజిక వర్గం నేతకు బరిలో దింపాలని చూస్తోంది. నియోజకవర్గంలో బీసీ వర్గం నుంచి బలమైన నేతగా ఉన్న కడారి అంజయ్య యాదవ్ కు బీజేపీ టికెట్ కేటాయిస్తుందని టాక్ విన్పిస్తోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్