https://oktelugu.com/

తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన మమతా బెనర్జీ

తెలుగు ప్రజలకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో తెలుగుకు అధికార హోదా కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ‘మినీ ఆంధ్రా’ గా పేరున్న ఖరగ్ పూర్ లోని తెలుగు ప్రజల కోసం మమత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పలు ఉద్యోగాల కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లిన వారు ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకున్నారు తదనంతరం రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. […]

Written By: , Updated On : December 23, 2020 / 10:16 AM IST
Mamata Banerjee
Follow us on

Mamata Banerjee

తెలుగు ప్రజలకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో తెలుగుకు అధికార హోదా కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ‘మినీ ఆంధ్రా’ గా పేరున్న ఖరగ్ పూర్ లోని తెలుగు ప్రజల కోసం మమత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పలు ఉద్యోగాల కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లిన వారు ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకున్నారు తదనంతరం రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. ఖరగ్ పూర్ బల్దియాలో ఉన్న 35 వార్డుల్లో ఆరో చోట్ల తెలుగువాళ్లే కౌన్సిలర్లుగా ఉన్నారు. దీంతో ఎన్నో ఏళ్ల నుంచి తమకు తెలుగు అధికార భాష కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు మమత కీలక నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.