మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా పూజా కార్యక్రమాలు మొదలు పెట్టిన, శుభకార్యాలు నిర్వహించిన కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యతనిస్తారు. ఏదైనా కార్యం ప్రారంభించేటప్పుడు కొబ్బరికాయ కొట్టి ఆ కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తారు.అంతేకాకుండా దేవాలయాలకు వెళ్లినప్పుడు దేవుడికి నైవేద్యంగా కొబ్బరికాయను సమర్పించడం మన భారతీయ ఆచార వ్యవహారాలలో ఒకటిగా భావిస్తారు.
Also Read: కస్టమర్లకు అమెజాన్ శుభవార్త.. స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..?
గుడికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు దేవునికి సమర్పించిన కొబ్బరికాయ కుళ్ళి పోయి ఉంటుంది. అలా కొబ్బరికాయ కుళ్ళిపోతే అశుభానికి సంకేతం అని చాలామంది భయపడుతుంటారు. అయితే ఇది కేవలం వారి అపోహ మాత్రమేనని కొబ్బరికాయ కుళ్ళిపోతే ఎలాంటి అశుభాలు జరగవని వేద పండితులు చెబుతున్నారు.
Also Read: గురక సమస్య వేధిస్తోందా.. ఆ అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్..?
వాస్తవానికి దేవునికి సమర్పించే టటువంటి పుష్పం, ఫలం, కొబ్బరికాయ వీటిలో ఏది సమర్పించిన స్వీకరిస్తానని, అది ఎలా ఉన్నా పరవాలేదు కానీ వాటిని భక్తితో సమర్పించడమే ముఖ్యమని సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో తెలియజేశాడు. కొన్నిసార్లు దేవుడికి కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వస్తే శుభసూచకమని భావిస్తారు. కానీ కొబ్బరికాయ కుళ్ళి పోతే అది అశుభమని పురాణాలలో ఎక్కడ చెప్పలేదు.కానీ మనసులో ఆ భగవంతుని ప్రార్థిస్తూ కొబ్బరికాయ కొట్టడం వల్ల మంచి జరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
కొందరు దేవునికి సమర్పించిన కొబ్బరికాయ కుళ్ళిపోతే మనలో ఉన్న చెడు స్వభావం, చెడు ఆలోచనలు, ఆ భగవంతుడు నశింపచేశాడని భావిస్తారు. కానీ ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాలకు దిష్టి తీసి టెంకాయలను కొట్టినప్పుడు కుళ్ళిపోతే దాని స్థానంలో మరొక కొబ్బరికాయను కొట్టడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగవని చెప్పవచ్చు. కొబ్బరికాయ కుళ్ళి పోయిన ఎలాంటి అశుభాలు జరగవని, ఇవన్నీ కేవలం మన అపోహలు మాత్రమేనని చెప్పవచ్చు.