అలర్ట్.. అలర్ట్.. ఆ దేశంలో కొత్తరకం కరోనా..!

కరోనా పేరు చెబితేనే ప్రపంచం బెంబేలెత్తిపోతుంది. చైనాలోని వ్యూహాన్లో సోకిన కరోనా వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు పాకింది. దీంతో ఆయా దేశాలన్నీ కూడా కరోనాపై ప్రజలకు పెద్దఎత్తున అవగాహన కల్పించాయి. Also Read: మహిళలకు తక్కువగా కరోనా సోకడానికి కారణం ఇదే..? కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా కోటికి చేరాయి. ఎన్నో లక్షలమంది కరోనా బారినపడి అర్థాంతరంగా తనువు చాలించారు. మరికొందరేమో కరోనాతో పోరాడి జయించారు. ప్రస్తుతం చాలామంది కరోనా పట్ల అవగాహన […]

Written By: Neelambaram, Updated On : December 19, 2020 8:23 pm
Follow us on

కరోనా పేరు చెబితేనే ప్రపంచం బెంబేలెత్తిపోతుంది. చైనాలోని వ్యూహాన్లో సోకిన కరోనా వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు పాకింది. దీంతో ఆయా దేశాలన్నీ కూడా కరోనాపై ప్రజలకు పెద్దఎత్తున అవగాహన కల్పించాయి.

Also Read: మహిళలకు తక్కువగా కరోనా సోకడానికి కారణం ఇదే..?

కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా కోటికి చేరాయి. ఎన్నో లక్షలమంది కరోనా బారినపడి అర్థాంతరంగా తనువు చాలించారు. మరికొందరేమో కరోనాతో పోరాడి జయించారు. ప్రస్తుతం చాలామంది కరోనా పట్ల అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉంటున్నారు.

ఇదిలా ఉంటే కరోనా సెకండ్ వేవ్ త్వరలోనే మొదలు కానుందని అన్నిదేశాలు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ అప్రమత్తంగా చేస్తోంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణమవుతున్న ఓ కొత్తరకం వైరస్ దక్షిణాఫ్రికాలో జన్యు శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు.

ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి జ్వెలీ కిజే ట్వీటర్లో వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో కరోనా సెకండ్ వేవ్ పెరగడానికి 501.వీ2 అనే కొత్త రకం వైరస్ కారణమని గుర్తించామని.. దీనిపై జన్యుశాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Also Read: అలాంటి మాస్కులు చాలా డేంజర్.. హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు..?

దక్షిణాఫ్రికాలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు తిమ్మిది లక్షలు దాటేయగా 20వేల మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ కొత్త వైరస్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలంతా మాస్కు ధరిస్తూ.. భౌతిక దూరం పాటించాలని సూచించారు.

ఈ కొత్తరకం వైరస్ గురించి ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. డబ్ల్యూహెచ్ఓ సైతం దక్షిణాఫ్రికా వైద్యులతో మాట్లాడుతూ తగు సూచనలు చేస్తున్నట్లు జ్వెలీ కిజే తెలిపారు.