Mad For Each Other Reality Show: త్వరలోనే స్టార్ మా ఛానల్ లో ‘బిగ్ బాస్ ‘ ని మించిన భారీ రియాలిటీ షో రానుంది. బిగ్ బాస్ అంటే ఏంటి ?, టాస్కులు , కంటెస్టెంట్స్ మధ్య గొడవలు , వీకెండ్ అయితే ఎలిమినేషన్లు , ఇవే కదా?, ఈ రియాలిటీ షో కూడా అలాగే ఉండబోతుంది. ఆ షో పేరు ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’. కానీ బిగ్ బాస్ లో ఎలిమినేషన్లు జనాల ఓటింగ్ ద్వారా ఉండేది, కానీ ఇక్కడ మాత్రం జడ్జీలు ఇచ్చే మార్కుల ఆధారంగా ఉంటుంది. ఈ షోలో 70 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతీ వారం ఒక ఎలిమినేషన్ ఉంటుంది. ఒక భారీ విల్లాలోకి 10 జంటలు ప్రవేశించి వారం రోజులు దాటింది. ఒక ఎలిమినేషన్ కూడా జరిగింది. ఈ షోలో విజేతలుగా నిల్చిన జంటకు 50 లక్షల రూపాయిల ప్రైజ్ మనీ కూడా ఉంటుందట .అయితే విల్లాలోకి ప్రవేశించిన పది జంటలలో హరిత – హరీష్ మరియు నటరాజ్ మాస్టర్ – నీతూ జంటలు కూడా ఉన్నాయి.
Also Read: తిరుమలేషుడి భక్తుల కోసం టీటీడీ సంచలన నిర్ణయాలు
హరీష్ ఎవరో మీ అందరికీ తెలిసిందే. ‘అగ్నిపరీక్ష ‘ షో లో మాస్క్ మ్యాన్ గా పరిచయమైన ఈయన , తన విచిత్రమైన వ్యక్తిత్వం తో జ్యోరి ద్వారా ఎంపికై , బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. నాలుగు వారాల పాటు ‘బిగ్ బాస్ 9’ లో కొనసాగిన ఈయన , ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. ఇప్పుడు ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్ ‘ లో అయితే హరీష్ – హరిత జంట మొదటి వారం లోనే ఎలిమినేట్ అయ్యినట్టు తెలుస్తోంది. అయితే ఈ షోలో కంటెస్టెంట్స్ ఇస్తున్న కంటెంట్ మాములుగా లేదట. హరీష్ , నటరాజ్ మాస్టర్ మధ్య గొడవ అయితే వేరే లెవెల్ లో జరిగిందని అంటున్నారు. ఈ గొడవలో తప్పు ఎవరిదీ అనేది షో చూసిన తర్వాతే తెలుస్తుంది .
వచ్చే నెల రెండవ వారం నుండి ఈ రియాలిటీ షో స్టార్ మా ఛానల్ , జియో హాట్ స్టార్ లో టెలికాస్ట్ కానుంది. బిగ్ బాస్ లో జరిగే గొడవలు ఈ షోలో జరిగే గొడవలతో పోలిస్తే చాలా తక్కువ అని, ఇక్కడ గొడవలు ఏ రేంజ్ లో ఉన్నాయంటే, మొగుడు పిల్లలు విడిపోయే రేంజ్ లో ఉందని తెలుస్తోంది. ఇకపోతే మొదటి వారమే ఎలిమినేట్ అయినా హరిత – హరీష్ కి అన్యాయం జరిగిందా? , లేదా న్యాయంగానే వీళ్ళ ఎలిమినేషన్ జరిగిందా అనేది చూడాలి.