
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సిద్ధాంతకర్త ఎంజీ వైద్య (97) శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నాగ్‌పూర్‌లోని స్పందనా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను నాగ్‌పూర్‌లోని అంబజరీ ఘాట్‌లో ఆదివారం ఉదయం 9 గంటలకు 30 నిమిషాలకు నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు ఆర్‌ఎస్‌ఎస్ సంయుక్త కార్యదర్శి డాక్టర్ మన్‌మోహన్ వైద్య తెలిపారు. తొమ్మిది దశాబ్దాలుగా సంఘ్ సేవక్‌కు ఎంజీ వైద్యకు విడదీయలేని అనుబంధం ఉంది.