Site icon OkTelugu

Mahesh Babu Rejected Movies: మహేష్ బాబు వదిలేసిన మూవీస్ చేసి ఆ ముగ్గురు స్టార్ హీరోలు అయ్యారా..?

Mahesh Babu Next Movie After Varanasi

Mahesh Babu Next Movie After Varanasi

Mahesh Babu Rejected Movies: రాజకుమారుడు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు… సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న ఆయన మొదటి సినిమాతోనే నటుడిగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇక ఆ తర్వాత చేసిన వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే పోకిరి సినిమా వచ్చిందో అప్పటినుంచి స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగాడు… ప్రస్తుతం ఆయన ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ లో పాల్గొంటున్నట్టుగా తెలుస్తుంది. రాజమౌళి సైతం ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం డిఫరెంట్ టెక్నాలజీ లను వాడుతూ సినిమాని తెరకెక్కిస్తున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి… మహేష్ బాబు లాంటి నటుడితో సినిమా చేయడం అనేది పెద్ద సాహసం అనే చెప్పాలి. ఆయన చాలా రిజర్వుడ్ గా ఉంటాడు. తనకు నచ్చిన సన్నివేశాలు మాత్రమే చేస్తాడు. మిగతా సన్నివేశాలను పెద్దగా పట్టించుకోడానే ఒక న్యూస్ అయితే ఇండస్ట్రీ లో వినిపిస్తుంటుంది. వారణాసి సినిమాలో మాత్రం రాజమౌళి ఏదైతే చెప్తున్నాడో అది చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటున్నాడు.

ఈ మూవీ తో ప్రపంచ స్థాయిలో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన సన్నాహాలైతే చేస్తున్నాడు. ఇక మహేష్ బాబు తన ఎంటైర్ కెరియర్ లో కొన్ని సినిమాలను రిజెక్ట్ చేశాడు. ఆయన చేయకపోవడం వల్ల ఆ సినిమాలను వేరే హీరోలు చేసి సూపర్ సక్సెస్ లను సాధించారనే విషయం మనలో చాలామందికి తెలియదు.

ముఖ్యంగా ‘వర్షం’ సినిమా మొదట మహేష్ బాబు చేయాల్సింది. కానీ ఆయన ఈ మూవీ స్టోరీ కూడా ‘ఒక్కడు’ కథలానే ఉందని హీరోయిన్ కోసం తిరిగే కథ కావడంతో దానిని రిజెక్ట్ చేశాడట. దాంతో ఈ మూవీని ప్రభాస్ చేసి స్టార్ హీరోగా అవతరించాడు… పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘దేశముదురు’ సినిమా కూడా మహేష్ బాబు చేయాల్సింది.

కానీ పోకిరి తర్వాత ఆ సినిమా చేయడం మహేష్ బాబుకు నచ్చకపోవడంతో దాన్ని రిజెక్ట్ చేశాడు. ఆ సినిమాతో అల్లు అర్జున్ ఆ సినిమా చేసి భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు… ఇక రవితేజ చేసిన ‘కృష్ణ’ సినిమా కూడా మొదట మహేష్ బాబు దగ్గరికి వచ్చింది. ఆ సినిమాని కూడా తను పట్టించుకోలేదు. దాంతో రవితేజ కెరీర్ లోనే అప్పట్లో బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలవడంతో తను టాప్ హీరోగా మారిపోయాడు…

Exit mobile version